శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమనాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ బంగారం రవాణా గుట్టు. వీరిపై కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు.

బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్‌ ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్‌ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి అనుమానం రాకుండా లోదుస్తుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Latest Articles