అక్క‌డ మాస్క్ ధ‌రిస్తే…భారీ జ‌రిమానా… ఎందుకంటే…

ప్ర‌పంచాన్ని క‌రోనా ఎంత‌టా ఇబ్బందుల‌కు గురి చేసిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాలి, రెండోది వ్యాక్సినేష‌న్ తీసుకోవాలి.  అమెరికాలో ఇప్ప‌టికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుండ‌టంతో ఆ దేశంలో క‌రోనా తగ్గుముఖం ప‌ట్టింది.  మాస్క్ ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇప్ప‌టికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.  కానీ, క‌రోనాకు భ‌య‌ప‌డి ఇంకా ప్ర‌జ‌లు మాస్క్ ధ‌రిస్తూనే ఉన్నారు.  దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్ రెస్టారెంట్ ఓ నిర్ణ‌యం తీసుకుంది.  మాస్క్ ధ‌రించి రెస్టారెంట్‌లోకి వ‌స్తే వారికి బిల్లుపై అద‌నంగా 5 డాల‌ర్లు జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌క‌టించిది.  అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మాస్క్ లేకుండా రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ఏ మాత్రం ఒప్పుకోవ‌డంలేదు.  5 డాల‌ర్లు అద‌నంగా క‌ట్టేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నార‌ని, మాస్క్ మాత్రం తీయ‌డం లేద‌ని రెస్టారెంట్ యాజ‌మాన్యం చెబుతున్న‌ది.  అద‌నంగా వ‌సూలు చేస్తున్న 5 డాల‌ర్ల‌ను స్వ‌చ్చంద సంస్థ‌కు విరాళంగా ఇస్తున్న‌ట్టు రెస్టారెంట్ యాజ‌మాన్యం తెలిపింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-