కరివేపాకు టీతో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

మనం జనరల్‌గా కరివేపాకుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కూరల్లో అవి వస్తే… తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీరు గనుక అలా చేస్తూ ఉంటే… కనీసం కరివేపాకులతో టీ తాగే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే అద్భుత ప్రయోజనాలు అలాంటివి. సౌత్ ఇండియాలో కరివేపాకుల టీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమాటకొస్తే ఇప్పుడు దేశంలో చాలా మంది దీన్ని తాగుతున్నారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. కరివేపాకు మనకు అన్ని చోట్లా లభిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఏయే లాభాలు కలిగిస్తుందో తెలుసుకుందాం. దాని కంటే ముందు టీ తయారీ నేర్చుకుందాం.

Read Also : రోజుకు ఓ రెండు లవంగాలు అలా నోట్లో వేసుకుంటే కలిగే 10 లాభాలు ఇవే..

ముందుగా 25-30 కరివేపాకులను తీసుకోండి. స్వచ్ఛమైన నీటితో వాటిని సుతిమెత్తగా కడగండి. ఓ గిన్నెలో ఓ కప్పు నీటిని ఉడికించండి. మంట ఆర్పేసి… కరివేపాకుల్ని నీటిలో వెయ్యండి. ఆకులన్నీ ఉడికే వేడి నీటిలో మునిగేలా చెయ్యండి. నీటి రంగు మారడాన్ని గమనించండి. రంగు మారగానే… నీటిని కప్పులోకి ఫిల్టర్ చెయ్యండి. అంతే కరివేపాకు టీ రెడీ. దీనికి మీరు అదనంగా తేనె, బెల్లం (నల్లబెల్లం ఇంకా ఎక్కువ ప్రయోజనం) వంటివి కలిపి తాగొచ్చు. లేదా… తేనె, నిమ్మరసం కలిపి తాగొచ్చు. ఇప్పుడు కరివేపాకు టీ ప్రయోజనాలు తెలుసుకుందాం. మన దేశంలో చాలా మంది మలబద్ధకం (Constipation) సమస్య ఉంది. అలాంటి వారు ఈ టీ తాగితే… కడుపులో సమస్యలన్నీ పరారవుతాయి. తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుంది. మూత్రాశయం బాగా పనిచేస్తుంది. పొట్టలో గ్యాస్, మూత్ర విరేచనాల వంటివన్నీ ఈ టీ తాగుతూ ఉంటే… ఆటోమేటిక్‌గా నయమవుతాయి. డయాబెటిస్ (Diabetes – షుగర్) సమస్య ఉన్నవారు తాగేందుకు ఇదో బెస్ట్ టీ అనుకోవచ్చు. ఇది బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగనివ్వదు. అంతేకాదు… లెవెల్స్ ఎక్కువగా ఉంటే… సరిచేస్తుంది. చికాగో యూనివర్శిటీలో జరిపిన పరిశోధనలో కరివేపాకుల టీ… బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని 45 శాతం తగ్గిస్తున్నట్లు తేలింది. ఇంతకంటే ఏం కావాలి. (credit – twitter – Blaine Gobbels) ప్రెగ్నెంట్ మహిళలకు వికారం, వామ్టింగ్స్ వస్తున్న ఫీల్ కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు కరివేపాకుల టీ తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ప్రయాణాలకు వెళ్లే ముందు… ఈ టీ తాగితే… జర్నీలో వాంతులు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే అసౌకర్యంగా ఫీలయ్యే వారు ఈ టీ తాగితే… ఫుల్ జోష్‌ వచ్చేస్తుంది. కరివేపాకుల్లో ఫెనోలిక్స్, యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి అడ్డమైన చర్మ వ్యాధులు రాకుండా చేస్తాయి. చర్మ కణాలు పాడవకుండా కాపాడతాయి. కాన్సర్‌ను అడ్డుకుంటాయి. బాడీలో వేడిని తగ్గిస్తాయి. మీరు ఎప్పుడూ టెన్షన్లతో ఉంటారా… అయితే… కరివేపాకుల టీ మీకు రిలాక్స్ కలిగిస్తుంది. ఇది మీ నరాలపై ప్రభావం చూపి… మీకు ప్రశాంతత కలిగిస్తుంది. పని చేసి బాగా అలసిపోతే… కరివేపాకు టీ తాగేయడం మేలు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే… ఇప్పుడు ఈ టీ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-