ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చింది.. ఓ ద‌శ‌లో రికార్డు స్థాయిలో న‌మోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంద‌ని చెప్పాలి.. దీంతో.. మ‌రోసారి క‌ర్ఫ్యూను పొడ‌గించే ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌ర్ప్యూ కొన‌సాగింపుపై ఆయ‌న సంకేతాలిచ్చారు.. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్ర‌కారం ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఏపీలో క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంది.. అయితే, ఇవాళ స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. జూన్ 20 వరకూ కర్ఫ్యూ ఉంటుందని చెప్పాం.. తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.. అయితే, సడలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుంద‌ని తెలిపారు.. ఇక‌, జూన్‌ 22న చేయూత పథకం అమలుకు కలెక్టర్లు సిద్ధం కావాల‌ని సూచించిన ఏపీ సీఎం.. జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమ‌లుచేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.. మ‌రోవైపు వైయస్సార్‌ బీమా జులై 1న ప్రారంభం అవుతుంద‌న్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-