ఏపీలో మ‌రో రెండు వారాలు క‌ర్ఫ్యూ..!

మ‌రో రెండు వారాల పాటు క‌ర్ఫ్యూ పొడిగించే ఆలోచ‌న‌లో ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌మించ‌నున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. ఈ స‌మీక్షా స‌మావేశంలోనే క‌ర్ఫ్యూ పొడ‌గింపుపై నిర్ణ‌యం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభ‌య‌గోదావ‌రి, చిత్తూరు జిల్లాలు మిన‌హా మిగ‌తా జిల్లాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. మే 31 త‌ర్వాత క్ర‌మంగా కొన్ని మిన‌హాయింపులు ఇవ్వ‌డం లేదా య‌థాస్థితిని కొన‌సాగించ‌డ‌మా? అనే దానిపై సోమ‌వారం నిర్ణ‌యం తీసుకోనున్నారు సీఎం జ‌గ‌న్.. దీనిపై సూచ‌న‌లు చేయాల్సింది ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించారు ఏపీ సీఎం.. మ‌రోవైపు.. జూన్ చివ‌రి వ‌ర‌కు క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని.. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌, క‌ర్ప్యూ లాంటి చ‌ర్య‌ల‌ను కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కేంద్రం సూచించింది.. దీనిపై నిర్ణ‌యం మాత్రం రాష్ట్రాల‌కే వ‌దిలేసింది. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో కూడా క‌ర్ఫ్యూ పొడ‌గింపుపై పున‌రాలోచ‌న‌లో ప‌డింది. మొత్తంగా సోమ‌వారం రోజు దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశంఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-