క్యూబాలో తారాస్థాయికి చేరిన నిర‌స‌న‌లు… అమెరికాకు ర‌ష్యా వార్నింగ్‌…

ద‌శాబ్దాల పోరాటం త‌రువాత ఫెడ‌ర‌ల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో క‌మ్యునిస్ట్ ప్ర‌భుత్వం ఏర్పాటైంది.  ద‌శాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో ప‌రిపాల‌న సాగిస్తోంది.  అయితే, గ‌త కొంత‌కాలంగా క్యూబాలో అల్ల‌ర్లు చెల‌రేగుతున్నాయి.  క‌రోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం త‌దిత‌ర అంశాలు దేశాన్ని ప‌ట్టిపీడుస్తున్న త‌రుణంలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హ‌వానాకు చేరుకొని ఉద్య‌మం చేస్తున్నారు.  క్యూబా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు మిగ్యుయెల్ దిజాయ్ క‌నెల్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  మాకు స్వేచ్చ‌కావాలి వెంట‌నే అధ్య‌క్షుడు రాజీనామా చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున హ‌వానాకు చేరుకొని నిర‌స‌న‌లు చేస్తున్న‌వారికి కంట్రోల్ చేసేందుకు పోలీసులు, ఆర్మి రంగంలోకి దిగింది.  

Read: ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్

ఉద్య‌మ‌కారుల‌ను అదుపుచేసే క్ర‌మంలో అదుపుత‌ప్ప‌డంతో హింస చోటుచేసుకుంది.  ఉద్య‌మ‌కారులు ప్ర‌భుత్వ ప్రైవేట్ ఆస్తుల‌ను ధ్వంసం చేశారు.  2018 లో ఇంట‌ర్నెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన క్యూబా, గ‌త ఆదివారం నుంచి దానిని స్థంబింప‌జేసింది.  ఇక‌, క్యూబాలో ప్ర‌జాఉద్య‌మంపై అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ స్పందించారు.  క్యూబా ప్ర‌జ‌లు చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ధ‌తు తెలిపారు.  క్యూబా ప్ర‌జ‌ల డిమాండ్‌ల‌ను అర్ధం చేసుకోవాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.  అయితే, ఈ ఉద్య‌మం వెనుక క్యూబ‌న్ అమెరికా ఏజెంట్ల హ‌స్తం ఉంద‌ని క్యూబా అధ్య‌క్షుడు పేర్కొన్నారు.  ఇక ఇదిలా ఉంటే, క్యూబా అంత‌ర్గ‌త విష‌యంలో మ‌రోదేశం త‌ల‌దూరిస్తే ఊరుకోబోమ‌ని రష్యా, మెక్సికోలు వార్నింగ్ ఇచ్చాయి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-