కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌..

2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా క్యాడర్ ఉద్యోగుల పోస్టింగ్స్ పూర్తి చేసినట్లు తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. 22 వేల 418 మంది టీచర్‌లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే 21 వేల 800 మంది తమ కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేశారు.. మిగిలిన వారు కూడా ఈ రోజు రిపోర్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 13 వేల 760 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.

జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల పోస్టింగ్స్ రేపటి వరకు పూర్తి అవుతాయని, ఇంత తక్కువ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తి చేయడం గొప్ప విజయమన్నారు.
పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసినందుకు కలెక్టర్ లకు, విభాగ అధిపతులకు సీఎస్ సోమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మార్గదర్శనం అందించినందుకు సీఎం కేసీఆర్‌కి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Latest Articles