త్వ‌ర‌లో డిజిట‌ల్ భూ స‌ర్వే.. ఏడు కంపెనీల‌తో సీఎస్ భేటీ

రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే చేసి నిర్వ‌హించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని తెలిపారు.. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమైంద‌ని.. ఇక‌, డిజ‌ట‌ల్ స‌ర్వే నిర్వ‌హిస్తే చాలా స‌మ‌స్య‌లు పోతాయ‌నేది సీఎం భావ‌న‌.. దానికి అనుగుణంగా.. ఇవాళ ఏడు కంపెనీల స‌మావేశం అయ్యారు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్.. డిజ‌ట‌ల్ స‌ర్వే ఎలా ఉండాల‌న్న‌దానిపై చ‌ర్చించారు.. ఇప్ప‌టికే స‌ర్వే కోసం ప్ర‌భుత్వం రూ.400 కోట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందేకాగా.. ఇక్క‌డ స‌ర్వే చేసే ముందు.. బ‌య‌టి రాష్ట్రాల్లో చేసిన స‌ర్వేల‌పై అధ్య‌య‌నం కూడా చేయ‌నున్నారు. ఇక‌, సీఎస్ స‌మావేశ‌మైన ఈ ఏడు కంపెనీల ప్ర‌తినిధుల‌తో సీఎం కేసీఆర్ కూడా భేటీకానున్నారు. మొత్తంగా డిజ‌ట‌ల్ స‌ర్వే వైపు మంద‌డుగులు ప‌డుతున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-