దేశంలో అధికారిక క్రిప్టో క‌రెన్సీకి కేంద్రం ఓకే చెప్ప‌బోతుందా?

ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం క్రిప్టో క‌రెన్సీ గురంచే చ‌ర్చించుకుంటున్నారు.  బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీతో, ఎవ‌రి నియంత్ర‌ణ లేని విధంగా ఈ క‌రెన్సీ న‌డుస్తుంది.  డిమాండ్‌, సప్లై పై ఆధార‌ప‌డి క్రిప్టోక‌రెన్సీ విలువ ఉంటుంది.  అయితే, నియంత్ర‌ణ‌లేని క‌రెన్సీని ఏ దేశం కూడా అధికారికంగా ఆమోదించ‌లేదు. ఇక ఇదిలా ఉండే, న‌వంబ‌ర్  29 నుంచి జ‌రిగే శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో క్రిప్టో క‌రెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.  ది క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ అఫిషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్ 2021 పేరిట ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది.  

Read: ఆన్‌లైన్‌లో పుస్త‌కాలు కొనుగోలు చేసింది… ఆ త‌రువాత వ‌చ్చిన మెసేజ్‌ల‌ను చూసి షాకైంది…

దీనిపై కేంద్ర ప్ర‌భుత్వానికి పార్ల‌మెంట్ స్థాయి సంఘం ఈ క‌రెన్సీకి సంబంధించి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసింది.  ఈ క‌రెన్సీని ఎవ‌రూ అప‌లేర‌ని, అయితే, నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్ల‌మెంట్ స్థాయి సంఘం స‌ల‌హాలు ఇచ్చింది.  అధికారిక డిజిట‌ల్ క‌రెన్సీ ఏర్పాటుకు త‌గిన ప్ర‌ణాళిక‌ల‌కు ఈ బిల్ వీలు క‌ల్పించే అవాకాశం ఉంటుంది.  ఈ బిల్ ఉభ‌య స‌భ‌ల ఆమోదం పొందితే దేశంలో అధికారిక డిజిట‌ల్ క‌రెన్సీ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. దీనికి అనుగుణంగానే ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీపై నిషేదం విధించ‌వ‌చ్చు.  

Related Articles

Latest Articles