చేపల కోసం వెళితే.. మొసలి మింగేసింది!

చేపల కోసం గాలం వేస్తున్న బాలుడిని లాక్కెళ్లిన మొసలి ఉదంతం ఇది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నది ఒడ్డున కూర్చుని చేపలకు గాలం వేస్తున్నాడు ఓ బాలుడు. నదిలో మొసలి వుందన్న సంగతి ఆ చిన్నారికి తెలీదు.

దీంతో ఆ మొసలి దాడిచేసి కుర్రాడిని లాక్కెళ్లిపోయింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగరలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. మోహీన్ మహమూద్ అనే 15 ఏళ్ల బాలుడు స్థానిక కాళీ నదిలో స్నేహితులతో కలిసి చేపల వేట కోసం వెళ్లాడు. ఒడ్డున కూర్చుని చేపల కోసం గాలం వేస్తున్నాడు. అదే సమయంలో మొసలి అమాంతం అతడిపై దుమికింది. అతడిని అమాంతం పట్టుకుని లాక్కెళ్లిపోయింది.

దీంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీసిన అతడి స్నేహితులు విషయాన్ని గ్రామస్థులకు చెప్పారు. స్థానికులు వచ్చి నదిలో గాలించారు. కానీ ఆ మొసలి జాడ కనిపించలేదు. చేపల కోసం వెళ్ళి పిల్లాడు మొసలికి బలి కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొసళ్ళు కాళీ నదిలోకి వచ్చాయంటున్నారు స్థానికులు.

Related Articles

Latest Articles