సీఎం స్టాలిన్‌పై విమర్శల వెల్లువ.. ఎందుకో తెలుసా..?

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో మందుకు వెళుతున్నారు ఎంకే స్టాలిన్. మొన్నటి వరకు ఆయన చేసిన పనులకు నీరాజనం పట్టిన ప్రజలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. అయితే ఈ నేపథ్యంలో వరదలు సంభవించాయి. దీంతో వరదలను ఎదుర్కొవడంలో ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం విఫలమైందంటూ ట్విట్టర్‌ వేదికగా గోబ్యాక్‌స్టాలిన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో విమర్శలు సంధిస్తున్నారు.

అంతేకాకుండా సిమెంట్‌ బస్తాల ధరలను రూ.360 నుంచి రూ. 520 పెంచారంటూ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డిజీల్‌ ధరలను తగ్గించిన తమిళనాడు ప్రభుత్వం తగ్గించలేదని మండిపడుతున్నారు. తమిళనాడు ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం స్టాలిన్‌ ఇండియా సిమెంట్‌ శ్రీనివాసన్‌ నిర్వహించిన సీఎస్‌కే పార్టీకి హజరవుతున్నారని, కార్పొరేట్‌కు ఎవరు మొగ్గు చూపుతున్నారంటూ..? ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

Related Articles

Latest Articles