“హీరో”కు షార్ప్ రన్ టైమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాలుగా కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది సాధారణంగా సినిమాలకు ఉండే షార్ప్ రన్‌ టైమ్.

Read Also : హీరో దాడి… దారుణమైన ఘటనపై హీరోయిన్ ఫస్ట్ రియాక్షన్

“2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌లో మీరు కనీసం 2 గంటల పాటు నవ్వుతూ ఉంటారు. ఇప్పటి వరకు నా కమర్షియల్‌ సినిమా ఇదే’’ అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సినిమాలో అశోక్ ‘హీరో’ అవ్వడానికి పడే కష్టాలను చూపించారు. ఈ చిత్రంలో అశోక్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అశోక్ తల్లి, మహేష్ బాబు సోదరి పద్మావతి కొత్తగా ప్రారంభించిన అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

Latest Articles