కాకినాడ సాయిసుధా హాస్పిటల్ అధినేతపై క్రిమినల్ కేసు నమోదు

కాకినాడ సాయిసుధా హాస్పిటల్ అధినేత, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వాడ్రేవు రవిపై క్రిమినల్ కేసు నమోదు చేసారు. కొవిడ్ కేసుకు అత్యధికంగా 14 లక్షల రూపాయలు ఫీజు వసూలు, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం, మృతుడు కుటుంబ సభ్యులను మోసగించారనే అభియోగాలపై బాధితులు ఫిర్యాదు చేసారు. క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడ త్రీటౌన్ పోలీసులు. డాక్టర్ వాడ్రేవు రవిని పోలీసు స్టేషన్ లో విచారించారు త్రీటౌన్ సి.ఐ. రామకోటేశ్వరరావు. ఇక సాయిసుధా హాస్పిటల్ కు నోటీసులు జారీ చేసారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-