భ‌య‌పెడుతున్న మ‌రో కొత్త ఫంగ‌స్‌… చికిత్స చేయ‌కుంటే…

క‌రోనా కాలంలో రోజుకోక కొత్త ఇన్పేక్ష‌న్‌, రోజుకో కొత్త ఫంగ‌స్‌లు భ‌యపెడుతున్నాయి.  ఈ ఫంగ‌స్ లు ఎంత‌వ‌ర‌కు అపాయ‌మోగాని, వాటిపై వ‌స్తున్న వార్త‌ల‌తోనే చాలామంది ఇబ్బందులు ప‌డుతున్నారు.  బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్ లు ద‌డ‌పుట్టిస్తుండ‌గా ఇప్పుడు మ‌రో కొత్త వైర‌స్ ఇబ్బంది పెడుతుంది.   అదే క్రీమ్ ఫంగ‌స్‌.  క్రీమ్ ఫంగ‌స్ కేసు ఒక‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ వైద్య క‌ళాశాలలో ఈఎన్‌టీ వైధ్యాధికారులు గుర్తించారు.  బ్లాక్ ఫంగ‌స్‌తో పాటుగా రోగి శ‌రీరంలో క్రీమ్ ఫంగ‌స్‌ను కూడా వైధ్యాదికారులు గుర్తించారు.  అయితే అత‌ని ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ప్ర‌స్తుతం వైద్యం అందిస్తున్నామ‌ని చెబుతున్నారు.  మితిమీరిన యాంటి బ‌యాటిక్ ఔష‌దాలను వినియోగించ‌డం వ‌ల‌న జీర్ణాశయంలోని గ‌ట్ బ్యాక్టీరియా న‌శిస్తుంద‌ని, దీని కార‌ణంగానే ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తున్నాయ‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-