‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డ్యాన్స్ వీడియో… ఇంటర్నెట్ లో వైరల్!

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ఊహించిన దానికంటే ఎక్కువే వర్కవుట్ అవుతోంది! కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. అయితే, రివ్యూస్ తో పాటూ రచ్చ కూడా ఎదురవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ తమిళనాడులో వివాదాస్పదంగా మారింది ఈలమ్ తమిళుల్ని అవమానించేలా ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఉందంటూ చాలా మంది ధ్వజమెత్తుతున్నారు. కొందరైతే బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా వెబ్ సిరీస్ పై అసంతృప్తితో ఉందట!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ చుట్టూ ముసురుకుంటోన్న కాంట్రవర్సీలు ఎలా ఉన్నా సామాన్య ప్రేక్షకులు మాత్రం సిరీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, సమంత ఓ కీలక పాత్ర పోషించిన ‘ద ఫ్యామిలీ మ్యాన్’లో మనోజ్ బాజ్ పాయ్ ది టైటిల్ రోల్. అతడికి జోడీగా ప్రియమణి నటించింది. ప్రస్తుతం నెట్ లో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ బిహైండ్ ద సీన్స్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ టీమ్ ఉత్సాహంగా గంతులేస్తున్నారు! మనోజ్ బాజ్ పాయ్ కూడా కెమెరా ముందు లైట్ గా లెగ్స్ షేక్ చేశాడు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-