పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా…

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఈ సందర్బంగా సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ… కరోనా కష్టాల్లో జనం ప్రాణలు కోల్పోతుంటే మోడీ మాత్రం పెట్రోల్ ధరలు మే నెలలో 9 సార్లు పెంచారు. అంబాని, ఆధానిల వ్యాపారం కోసం పెట్రోల్ పై పన్నులు పెంచుతున్నారు అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు తగ్గిస్తాం అని చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా వ్యవస్థ కూలిపోయింది. కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ప్రజలను దోచుకుంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి అని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-