సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలి : సీపీఐ రామకృష్ణ

రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానితో ఎపుడు కలిసినా పాడిందేపాటగా ఒకే అంశం ప్రత్యేక హోదా అంటారు. గతంలో అడిగినవే అడిగారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమేమి అంశాలుపెట్టారో బయటకు రానివ్వరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు.

మీడియా సమావేశంలో ఎందుకు వెల్లడించరు. ప్రధాని ఏమన్నారో చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు 20వేల కోట్లు కోత పెట్టారు. 55వేల 50 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు బకాయిలు వున్నాయని జగన్ చెబుతున్నారు. విభజన హామీలు లేవు, నిధులు లేవు అయినా ఎందుకు నిలదీయడం లేదు. రాష్ట్రాన్నికి కేంద్రం అన్యాయం చేస్తుంటే ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మీరు లాలూచీ పడుతున్నారా.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై గొంతెత్తకపోతే రాష్ట్రం దివాళ తీస్తుంది. గంగవరం పోర్టు అమ్మేసుకున్నారు. 25 ఎంపీలు ఇవ్వాలని ఎన్నికలలో అడిగి గెలిచి కేంద్రంలో ఏం సాధించావు. లాలూచీ ఎమిటో బయట పెట్టాలని రామకృష్ణ మండిపడ్డారు.

Related Articles

Latest Articles