ఏపీ రాజకీయాలపై సిసిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సిసిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబర్‌ ఎంపీ రఘరామకృష్ణంరాజు… జగన్ బెయిన్ రద్దు చేయాలని పిటిషన్ వేసారని… అలాగే రఘరామకృష్ణం రాజు సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ అంటుందని పేర్కొన్నారు. వీరి ఇరువురి నాటకాన్ని అమిత్ షా చూస్తున్నాడని.. అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం జగన్ కు బెయిల్ రద్దు కాదన్నారు. అటు కేంద్రంపై ఫైర్‌ అయిన నారాయణ… కరోనా నియంత్రణ లో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని.. తిరుపతి లో ఆక్సీజన్ లేక 23 మంది చనిపోతే 12 మంది అని చెప్పారన్నారు.

read also : తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. వరుసగా నేతల పాదయాత్రలు !

దేశంలో కార్పోరేట్ ఆసుపత్రులు కోవిడ్ వల్ల లాభపడ్డాయని… 64% వారి ఆస్తులు పెరిగాయన్నారు. అంబానీ, అదాని ఆస్తులు అమాంతంగా పెరిగాయని చెప్పారు. చనిపోయిన వారికి 5 లక్షల ఇవ్వలేని కేంద్రం… కార్పొరేట్ లకు లక్ష ఆరవై కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందని… పబ్లిక్ సెక్టర్లు మొత్తం కేంద్రం అమ్మకానికి పెట్టిందని ఆగ్రహించారు.. దేశం లో ఇంత అవమానకరమైన ప్రధాని ఇంకోడు లేడని… ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ దేశాభివృద్ధి మీద లేదన్నారు. వ్యవసాయ చట్టం వస్తే రైతులు బానిసలౌతారని మండిపడ్డారు. దేశంలో ఆర్బిఐ, సిబిఐ, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ లను డమ్మి చేసారని…వాజపేయ్ మంచి రాజకీయ నేత అని.. మోడీ ఫ్యాక్షనిస్ట్ నేత అని నిప్పులు చెరిగారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-