తడిసిన ధాన్యం కొనాలి: చాడ వెంకట్‌ రెడ్డి

తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం ప్రారంభించిందని దీని ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ధాన్యం అంత తడిసిపోయిందని కొనుగోలు కేంద్రాల్లో కనీసం గన్నీ సంచులు, టార్ఫాలిన్లు కూడా ఇవ్వడం లేదని ఆయన ఫైర్‌ అయ్యారు.

నల్లగొండలో 626 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి ఫలితం లేదు. ధాన్యం కొనుగోలుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో తడిసిన ధాన్యాన్నికి మొలకలు వచ్చాయి. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతులపై రాజకీయాలు మాని ధాన్యం కొనుగోలు చేయా లని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జాప్యం చేయకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related Articles

Latest Articles