సీఎం జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

గ్రామపంచాయతీల పటిష్టత, నిధుల సమస్య తీర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సర్పంచ్ లకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం..?కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరి కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా..? పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఏపీలోని సర్పంచ్ లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పంచాయితీల నిధులు రూ.3,450 కోట్లను తిరిగి ఇవ్వాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో చేస్తున్న జాప్యం వల్ల సర్పంచ్ లు గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Related Articles

Latest Articles