టీఆర్ఎస్, బీజేపీది తెలంగాణలో గుద్దులాట.. ఢిల్లీలో ముద్దులాట..

టీఆర్ఎస్‌, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్‌ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని స్పష్టం చేసిన ఆయన.. సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువులు‌..‌ ముస్లిం నవాబులో గెలిచినట్లు బీజేపీ చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విద్యాసాగరరావు కేంద్ర హోంమంత్రిగా ఉండగా సాయుధ పోరాటయోధులకు పెన్షన్ ఇవ్వనన్నారని గుర్తుచేసిన నారాయణ.. టీఆర్ఎస్, బీజేపీది తెలంగాణలో గుద్దులాట.. ఢిల్లీలో ముద్దులాట అంటూ సెటైర్లు వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే భారత్ బంద్‌లో టీఆర్ఎస్, టీడీపీ కూడా పాల్గొనాలని సూచంచారు నారాయణ.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-