పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సందర్శించిన సీపీ

బంజారాహిల్స్‌లో ఉన్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 20 అంతస్తుల నిర్మాణం కమాండ్ కంట్రోల్ సెంటర్ సి.పి. హైదరాబాద్‌ కార్యాలయంగా పని చేయడమే కాకుండా సంక్షోభ నివారణ కేంద్రంగా మారబోతుందని తెలిపారు. 4 టవర్ల భవనం, 20 అంతస్తుల మొత్తం ప్రణాళికను మ్యాప్‌లను అధికారులు సీపీకి వివరించారు.

Read Also: మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం

అనంతరం భవనంలోని భద్రతా ప్రాంతాల నుంచి మొదలై అన్ని అంతస్తులు, రెండు అంతస్తుల్లో పార్కింగ్, సమావేశ మందిరాలు, ఆడిటోరియంలు, సీపీ హైదరాబాదు కార్యాలయం, నగర పోలీసు శాఖలోని అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ ఫ్లోర్లు, ముఖ్య మంత్రి, చీఫ్ సెక్రటరి, డీజీపీ రూమ్‌లను, డేటా సెంటర్‌, కమాండ్‌ కంట్రోలను సీపీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ పోలీసులు భద్రతలో రాజీ పడకుండా ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని సీపీ తెలిపారు.

Related Articles

Latest Articles