క‌బేళా నుంచి త‌ప్పించుకొని 800 కిమీ ప‌రుగులు తీసిన గోవు… వైర‌ల్‌..

మ‌న‌ద‌గ్గ‌ర ఒట్టిపోయిన ఆవుల‌ను క‌బేళాకు త‌ర‌లించి వ‌ధిస్తుంటారు.  అయితే, కొన్ని దేశాల్లో ఆవుల‌ను కేవ‌లం ఆహారం కోస‌మే పెంచుతుంటారు.  ఇలానే ఓ వ్య‌క్తి ఆవును క‌బేళాకు త‌ర‌లించాడు.  అక్క‌డ దానిని వ‌ధించేందుకు సిద్ధం కాగా వారి క‌ళ్లుక‌ప్పి ఆ గోవు అక్క‌డి నుంచి త‌ప్పించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చింది.  అక్క‌డే ఉంటే ప‌ట్టుకుంటార‌ని భావించిన ఆ గోవు 800 కిలోమీట‌ర్ల దూరం పారిపోయింది.  ఈ సంఘ‌ట‌న బ్రెజిల్‌లోని రియోడి జెనెరియోలో చోటుచేసుకుంది.  

Read: ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన బ్రెజిల్‌- అర్జెంటైనా మ్యాచ్‌…

రియోలోని ఓ క‌బేళా నుంచి త‌ప్పించుకొని 800 కిమీ ప్ర‌యాణం చేసి నోవా గ్రానెడా లోని వాట‌ర్ పార్క్‌కు చేరుకుంది.  ఆ పార్క్‌లోని ఓ వాట‌ర్ స్లైడ‌ర్ ఎక్కి దానిపై జారుతూ ఎంజాయ్ చేసింది.  ఈ దృశ్యాల‌ను ఆ పార్క్ య‌జ‌మాని వీడియోగా తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  సోష‌ల్ మీడియా ద్వారా ఆ ఆవు క‌బేళా నుంచి త‌ప్పించుకొని పారిపోయి వ‌చ్చిన‌ట్టుగా గుర్తించాడు.  కాగా, ఆ ఆవుకు టొబొ అని నామ‌క‌ర‌ణం చేశాడు.  ఆ ఆవును వాట‌ర్ పార్క్‌లోనే ఉంచాల‌ని టూరిస్టులు కోర‌డంతో అక్క‌డే ఉంచారు.  ఇప్పుడు ఆ పార్క్‌లో ఆ ఆవు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది.  దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. 

Related Articles

Latest Articles