వందేళ్ల కింద‌టి సంప్ర‌దాయాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాం-టీటీడీ చైర్మ‌న్

తిరుమ‌లలోని శ్రీవారి ఆలయంలో గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం స‌మ‌ర్పంచే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది టీటీడీ.. దీనిపై ఆనందాన్ని వ్య‌క్తం చేశారు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి.. దీంతో.. తిరుమలలో వందేళ్ల కింద‌టి సంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలోపున:ప్రారంభించామ‌న్న ఆయ‌న‌.. గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేథ్యం సమర్పించాం.. అద్భుతంగా ఉందని భక్తులు ప్రశంసించార‌న్నారు.. ల‌డ్డూ ప్రసాదం కూడా ఆర్గానిక్ పదార్థాల‌తో ప్రయోగాత్మకంగా త‌యారు చేయించామ‌ని.. లడ్డూ ప్రసాదం కూడా చాలా రుచికరంగా వ‌చ్చింద‌న్నారు.. దీంతో.. ల‌డ్డూ ప్రసాదం త‌యారికి ఆర్గానిక్ ముడిసరుకులు కోనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

-Advertisement-వందేళ్ల కింద‌టి సంప్ర‌దాయాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాం-టీటీడీ చైర్మ‌న్

Related Articles

Latest Articles