ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం నిర్ణయం.. కొత్త ధరలు ఇవే..

అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.. ఎక్కువ వసూలు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ఇక, తాజాగా, వ్యాక్సిన్లపై కీలక నిర్ణయానికి ప్రకటించింది కేంద్రం.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధరలను నిర్ణయించింది.. కోవిషీల్డ్ ధర రూ.780 కాగా, కోవాగ్జిన్‌ ధర రూ. 1,410గా ఉంటుందని ప్రకటించిన కేంద్రం.. ఇక, స్పుత్నిక్ -వి ధరను రూ.1,145గా పేర్కొంది… వీటికి పన్నులు అదనం.. అంటే.. పన్నులతో పాటు.. ప్రైవేట్ ఆస్పత్రుల రూ.150 సర్వీసు ఛార్జీ కూడా ఉండనుంది.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా పూర్తిగా ఉచితం కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాకుండా.. ప్రైవేట్‌ లో టీకాలు తీసుకునేవారికి పై ధరలు వర్తించనున్నాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-