కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ఒకే డోస్‌..!

కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌… మొదట ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లు తయారు చేశారు.. ప్రభుత్వ అనుమతితో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.. క్రమంగా విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇచ్చింది భారత్.. అయితే, కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదానిపై పరిశోధనలకు ఆమోదం లభించింది.. తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఈ పరిశోధనలు నిర్వహించనున్నారు..

అయితే, వ్యాక్సినేషన్‌ వేసుకునేందుకు ప్రజలు పోటీపడుతున్నారు.. దీంతో. .వ్యాక్సిన్ల కొరత కూడా వెంటాడుతుండగా.. కొందరికి ఒక్కో డోస్‌లో ఒక్కోరకం వ్యాక్సిన్‌ వేశారు. కానీ, రెండు రకాల టీకాలు వేసుకున్నా ఎలాంటి ప్రతీకూల ఫలితాలు మాత్రం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. థాయ్‌లాండ్‌ సహా కొన్ని దేశాల్లో ఈ రెండు టీకాలు కలిపి వేస్తున్నారు. ఈ రెండు టీకాలు కలిపివేస్తే మెరుగైన ఫలితాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి.. దీంతో.. రెండు టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై దృష్టి సారిస్తోంది భారత్.. దీనిపై పరిశోధనలు జరిపేందుకు కేంద్ర మందుల నాణ్యతా నియంత్రణ మండలి వైద్యనిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో 300 మందిపై ప్రయోగాత్మకంగా రెండు వ్యాక్సిన్‌లను ఒకే డోస్‌గా వేసి పరిశీలించేందుకు సిద్ధమయ్యారు వైద్యనిపుణులు. ఈ ఫలితాలు తేలిన తర్వాత.. వ్యాక్సినేషన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-