హుజురాబాద్ లో కొత్త టెన్షన్ !

హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఇక్కడే నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ తగ్గెదెలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలంతా ఓటర్లు చుట్టూ తిరగాల్సిన ఉండగా ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుండటం ఆందోళన రేపుతోంది.

హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలంతా హుజూరాబాద్లో తిష్టవేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రి గుంగుల కమాలకర్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు.

గంగుల కమాలకర్ సైతం తనతో తిరిగిన నేతలంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో అప్రమత్తమైన నేతలంతా ఇప్పుడు ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నేతలంతా కరోనా టెస్టులు చేయించుకుంటూ రిజల్ట్ పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్కరోజే 28మంది నేతల వరకు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా హుజూరాబాద్ ఆసుప్రతిలో మధ్యాహ్నం ఒంటిగంట వరకే కరోనా టెస్టులు కోసం షాంపిల్స్ సేకరిస్తున్నారు. దీంతో నేతలంతా ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నేతలంతా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు డ్రై ఫ్రూట్స్ ఆహారంగా తీసుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉంటే కరోనా టెస్టులకు రిజల్ట్ కు రెండు మూడ్రోజుల సమయం పడుతుండటంతో నేతలు తమకు పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు
-Advertisement-హుజురాబాద్ లో కొత్త టెన్షన్ !

Related Articles

Latest Articles