యూర‌ప్‌లో పెరుగుతున్న కేసులు… ఆసుప‌త్రుల వ‌ద్ద భారీ క్యూలు…

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో ప్ర‌పంచాన్ని వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి కేసులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్నాయి.  ముఖ్యంగా యూర‌ప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో మ‌ళ్లీ ఆందోళ‌న మొద‌లైంది.  ఆసుప‌త్రుల‌కు తాకిడి పెరిగింది.  పాజిటివ్ కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య సైతం పెరుగుతుండ‌టంతో యూర‌ప్ దేశాల్లో ఆంక్ష‌లు క‌ఠినం చేసేందుకు సిద్దం అవుతున్నారు.  క‌రోనా కేసుల‌తో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా యూర‌ప్ దేశాల్లో వ్యాపిస్తోంది.  యూర‌ప్‌లోని 19 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది.  

Read: ఉక్రెయిన్ సాక్షిగా అమెరికా ర‌ష్యా మ‌ధ్య మ‌ళ్లీ కోల్డ్ వార్ మొద‌లౌతుందా?

ఇప్ప‌టి వ‌ర‌కు 274 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లో మ్యూటేష‌న్‌లు అధికంగా ఉండ‌టంతో ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వ్యాక్సిన్ పెద్ద ఎత్తున అందిస్తున్నా కేసులు పెరుగుతూనే ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఇప్ప‌టికే కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించారు.  కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలానే పెరిగితే యూర‌ప్ వ్యాప్తంగా మ‌ళ్లీ లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి రావొచ్చు.  

Related Articles

Latest Articles