కరోనాపై తాజా రీసెర్చ్.. వైరస్‌ గాల్లో ఎంత సేపు ఉంటుందంటే..?

డ్రాగన్‌ కంట్రీ చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి క్రమంగా ప్రపంచదేశాలకు పాకింది.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ.. ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది.. ఇక, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో కొత్త కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి.. భారత్‌లోనూ వరుసగా పెరిగిపోతోన్న రోజువారి కేసులు 2 లక్షలకు చేరువగా వచ్చాయి.. అయితే, కరోనా వైరస్‌పై వ్యాప్తి, దాని ప్రభావం, ఇలా అనేక రీసెర్చ్‌లు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా, కరోనా వైరస్‌ గాల్లో ఎంత సమయం ఉంటుంది.. గాల్లో ఎంతసేపు మహమ్మారి ప్రభావం చూపగలదు లాంటి అంశాలపై కీలక విషయాలను బయటపెట్టింది యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్..

Read Also: సీఎంలతో ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్‌..?

ఇక, బ్రిస్టల్‌ వర్సిటీకి చెందిన అధ్యయంలోని కీలక అంశాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్‌ 20 నిమిషాలకు పైగా గాల్లో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తుందని తేల్చింది.. అయితే, గాల్లో ఉన్న మొదటి 5 నిమిషాల్లోనే దాని ప్రభావం అధికంగా ఉంటుందని.. ఆ ఐదు నిమిషాల తర్వాత సంక్రమణ శక్తికి క్రమంగా కోల్పోతోందని పేర్కొంది.. అయితే, ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు మాస్కుల వాడకం తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.. మాస్క్‌లు ధరిస్తూ.. భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, దూరాన్ని పాటించడం వల్ల కోవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అంతేకాదు.. కరోనా వ్యాప్తి చెందే ప్రాంతాలపై కూడా కొంత క్లారిటీ ఇచ్చారు.. వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో వైరస్‌ అధికంగా సంక్రమించే అవకాశం ఉంటుందని.. ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించలని పేర్కొంది.. మొత్తంగా ప్రజలు దగ్గరగా ఉంటేనే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువని ఆ అధ్యయనం తేల్చింది..

Related Articles

Latest Articles