ఏపీలో దారుణం : కరోనా భయంతో ఆసుపత్రిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

విశాఖ విమ్స్ లో మరో దారుణం చోటు చేసుకుంది. గొల్ల పాలెం భీమినిపట్నంకు చెందిన ఎమ్. వేణు బాబు (37) అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోవిడ్ తో ఈ నెల 1న విమ్స్ హాస్పిటల్ లో చేరిన వేణు బాబు..ఆత్మస్తైర్యం కోల్పోయి విమ్స్ హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలవరం రేపుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వేణు బాబు. హాస్పిటల్స్ లో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో అధికారులను కలవరం మొదలైంది. కాగా ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,17,156 కు చేరింది. ఇందులో 15,62,229 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,43,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-