తాజా సర్వే…మనిషి జీవనంపై కోవిడ్ ప్రభావం…

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌దిలిపెట్ట‌లేదు.  వ్యాక్సిన్‌ను వేగంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు తగ్గిన‌ట్టుగానే త‌గ్గి మ‌ర‌లా అధిక సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌, జ‌పాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిపై క‌రోనా విజృభిస్తున్న‌ది.  వీరికి క‌రోనా సోకితే ముప్పు తీవ్ర‌త అధికంగా ఉంటుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది.  మ‌ధుమేహం బాధితుల‌కు కరోనా సోకితే ముప్పు 2.3 రెట్లు అధికంగా ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తెలియ‌జేసింది.  దీర్ఘ‌కాలంగా వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారిని ఈ వైర‌స్ ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్న‌ట్టు అధ్య‌య‌నంలో తేసింది  అంతేకాకుండా పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, కాలుష్యం కార‌ణంగా కూడా క‌రోనా ముప్పు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  

Read: అల్లరి నరేష్ “సభకు నమస్కారం”లో మరో యంగ్ హీరో

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-