అదృష్టమంటే ఆ అమ్మాయిదే.. వ్యాక్సిన్​ లాటరీలో 7.45 కోట్లు!

ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం వాక్సినేషన్.. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు టీకాలను ప్రోత్సహించడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. అయితే అమెరికా కొలరాడో రాష్ట్రం వ్యాక్సినేషన్​ను ప్రోత్సాహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ లాటరీని ప్రవేశపెట్టింది. కాగా, తాజాగా లక్కీ లాటరీ డ్రా పేర్లను అనౌన్స్ చేయగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. హైడీ రెస్సెల్​ అనే మహిళను విజేతగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు​. దాని ద్వారా ఆమె 1 మిలియన్​ డాలర్లు (సుమారు రూ.7.45కోట్లు) గెలుచుకుంది. ఈ విషయం తెలియగానే తాను నమ్మలేకపోయానంటూ లాటరీ విజేత చెప్పుకొచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-