కోవిడ్‌ వ్యాక్సినేషన్‌.. మన స్థానమంటే..?

పట్నం నుంచి పల్లె వరకు.. సిటీ నుంచి మారు మూల గ్రామం వరకు.. అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది.. మొదట స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. 2021 జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు ఎగుమతి చేసింది.. ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్‌ డోసులను అందిస్తుండగా.. భారత్‌ కూడా ప్రికాషన్‌ డోసులను పంపిణీ చేస్తోంది.. దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ మొదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. మన దగ్గర ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది.. మిగతా దేశాల్లో పరిస్థితులు ఏంటి? వ్యాక్సినేషన్‌లో ఎవరు ముందున్నారు.. వెనుకబడింది ఎవరో ఓసారి చూద్దాం..

Read Also: కోవిడ్‌ చికిత్స.. మరో 2 ఔషధాలకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌

వ్యాక్సినేషన్‌లో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. మహమ్మారి వెలుగు చూసిన ఆ దేశంలో.. వ్యాక్సినేషన్‌ కూడా వేగంగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటి వరకు చైనాలో 289 కోట్ల డోసులు పంపిణీ చేశారు.. అంటే 84 శాతం మందికి వ్యాక్సిన్‌ వేసింది. ఇక, ఆ తర్వాత స్థానంలో 155.3 కోట్ల డోసులతో భారత్‌ రెండో స్థానంలో ఉంది.. భారత్‌లో 46.9 శాతం మందికి వ్యాక్సిన్‌ చేరింది. ఆ తర్వాత వరుసగా అమెరికాలో 52.4 కోట్ల డోసులు, బ్రెజిల్‌లో 33.9 కోట్ల డోసులు, ఇండోనేషియాలో 29.3 కోట్ల డోసులు, జపాన్‌లో 20.2 కోట్ల డోసులు, పాకిస్థాన్‌లో 16.6 కోట్ల డోసులు, వియత్నాంలో 16.4 కోట్ల డోసులు, జర్మనీలో 15.7 కోట్ల డోసులు, రష్యాలో 15 కోట్ల డోసులు, మెక్సికోలో 14.9 కోట్ల డోసులు.. ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 945 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. మొత్తంగా ఇప్పటి వరకు 50.3 శాతం మందికి వ్యాక్సిన్‌ అందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Related Articles

Latest Articles