ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో క‌రోనా ట్రీట్మెంట్ ధ‌ర‌లు ఇవే…

రాష్ట్రంలో క‌రోనా కేసులు వేగంగా విస్త‌రిస్తున్నాయి.  ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌తో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.   ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో క‌రోనా చికిత్స‌, ప‌రీక్ష‌ల గ‌రిష్ట ధ‌ర‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  దీనికి సంబందించి జీవో 40ని జారీ చేసింది. ఈ జీవో ప్ర‌కారం నిర్ణ‌యించిన ఫీజుల‌ను మాత్ర‌మే వ‌సూలు చేయాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.  

Read: థర్డ్‌వేవ్‌ తప్పదు… ఆ రెండు నెలల్లోనే !

సాధార‌ణ వార్డుల్లో ఐసోలేష‌న్‌, ప‌రీక్ష‌ల‌కు గ‌రిష్టంగా రూ.4వేలు,ఐసీయూలో గ‌రిష్టంగా రూ.7500, వెంటిలేట‌ర్‌తో కూడిన ఐసీయూకి రూ.9వేలు, హెచ్ఆర్‌టీసీకి రూ.1995, డిజిట‌ల్ ఎక్స్‌రేకి రూ.1300, డిడైమ‌ర్‌కి రూ.300, సీఆర్‌పీకి రూ.500, ప్రొకాల్ సీ తోసిన్‌కి రూ.1400, ఫెరిటిన్‌కి రూ.400, ఎన్‌డీహెచ్‌కి రూ.140, సాధార‌ణ అంబులెన్స్‌కు కిలోమీట‌ర్‌కు రూ.75, అధునాత‌న అంబులెన్స్‌కి కిలోమీట‌ర్‌కి రూ.125 వ‌సూలు చేయాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-