పార్లమెంట్‌లో క‌రోనా క‌ల‌క‌లం: 350 మంది సిబ్బందికి పాజిటివ్‌…

ఢిల్లీలో క‌రోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  ఢిల్లీలోని పార్ల‌మెంట్ భ‌వ‌న్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  గ‌త రెండు రోజులుగా పార్ల‌మెంట్ లో ప‌నిచేస్తున్న సిబ్బందికి క‌రోనా టెస్టులు చేస్తున్నారు.  తాజా స‌మాచారం ప్ర‌కారం రెండు రోజుల్లో 350 మంది సిబ్బంది క‌రోనా బారిన ప‌డ్డారు.

దీంతో పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  350 మంది సిబ్బందికి క‌రోనా సోక‌డంతో పార్ల‌మెంట్‌ను శానిటైజ్ చేస్తున్నారు.  ఢిల్లీలో ప్ర‌స్తుతం నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  పాజిటివిటీ రేటు పెరుగుతుండ‌టంతో వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఢిల్లీ రాష్ట్ర‌ప్ర‌భుత్వం వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించింది.  

Read: ఢిల్లీలో క‌రోనా టెర్ర‌ర్‌: 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు…

Related Articles

Latest Articles