క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం…

ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  తాజాగా క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  క‌ర్నూలోని మెడిక‌ల్ కాలేజీలో 15 మంది వైద్య విద్యార్థుల‌కు క‌రోనా సోకింది.  మొత్తం 50 మంది వైద్య విద్యార్థుల‌కు క‌రోనా నిర్థార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఎంబీబీఎస్ ఫ‌స్టీయ‌ర్ చ‌దువుతున్న 11 మంది విద్యార్థుల‌కు, న‌లుగురు హౌస్ స‌ర్జ‌న్‌ల‌కు క‌రోనా సోకింది.  మ‌రో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపారు.  

Read: వ‌ధువు కావాలంటూ వినూత్న రీతిలో బిల్‌బోర్డ్ ఎక్కిన యువ‌కుడు…

మెడిక‌ల్ కాలేజీలోని విద్యార్థుల‌కు క‌రోనా సోక‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగిన వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపీలో ఈరోజు నుంచి నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు కాబోతున్న‌ది.  నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  

Related Articles

Latest Articles