ఇండియాలో రెండు కోట్లు దాటిన పాజిటివ్ కేసులు 

ఇండియాలో రెండు కోట్లు దాటిన పాజిటివ్ కేసులు 

ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది.  తాజాగా ఇండియాలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది.  ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్టు సమాచారం.  ఇక గడిచిన 24 గంటల్లో 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక ఇదిలా ఉంటె, 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,449 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,22,408కి చేరింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-