క‌రోనా థ‌ర్డ్ వేవ్‌.. పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం ఉండొచ్చు-కేంద్రం

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ పెద్ద‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపింది.. సెకండ్ వేవ్ యూత్‌ను కూడా అత‌లాకుత‌లం చేసింది.. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండ‌గా.. దాని ప్ర‌భావం చిన్నారుల‌పైనే ఎక్కువ‌గా ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.. అయితే, దీనిపై స్పందించిన నీతిఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్.. క‌రోనా వైర‌స్ త‌న స్వ‌భావాన్ని మార్చుకుంటే పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం చూప‌వ‌చ్చు అన్నారు.. ఆ ప‌రిస్థితి వ‌స్తే.. రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందాల్సిన ప‌రిస్థితి రావొచ్చు అని అంచ‌నా వేసిన‌ట్టు తెలిపారు. అయితే, కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని.. దీనిపై త్వ‌ర‌లో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేస్తామ‌న్నారు డాక్ట‌ర్ వీకే పాల్… మ‌రోవైపు.. చిన్నారుల‌పై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతున్న‌ట్టు వెల్ల‌డించారు.. ఇక‌, చిన్నారులు వైర‌స్‌బారిన ప‌డినా వాటి ల‌క్ష‌ణాలు పెద్ద‌గా ఉండ‌బోవ‌న్న ఆయ‌న‌.. వైర‌స్ సోకినా తీవ్రత ఉండ‌బోద‌ని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-