ప‌ల్లే జీవితాన్ని కుదిపేస్తున్న క‌రోనా సెకండ్ వేవ్‌…

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని కుదిపేస్తున్న‌ది.  మొద‌టి వేవ్ ప్ర‌భావం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలై అధికంగా ఉండ‌గా, సెకండ్ వేవ్ ప్ర‌భావం గ్రామాలు, ప‌ల్లేల‌పై ఉన్న‌ది.  దీంతో గ్రామాల్లోని ప్ర‌జ‌లు ఆంధోళ‌న చెందుతున్నారు.  బ‌య‌ట‌కు రావాలంటే ఆలోచిస్తున్నారు.  మొదటి వేవ్ స‌మ‌యంలో న‌గ‌రాలకు వ‌ల‌స వెళ్లిన కూలీలు క‌రోనా కార‌ణంగా తిరిగి ప‌ల్లేబాట ప‌ట్టారు.  న‌గ‌రాల నుంచి ప‌ల్లెల‌కు చేరుకోవ‌డంతో మెల్లిగా గ్రామాల్లో క‌రోనా విస్త‌రించ‌డం మొదలైంది.  గ్రామాల్లో వైద్య‌సేవ‌లు ఎంత‌వ‌ర‌కు అందుబాటులో ఉంటాయో అంద‌రికి తెలిసిందే.  ఒకసారి క‌రోనా గ్రామంలో వ్యాపించ‌డం మొద‌లుపెడితే దానిని అడ్డుకోవ‌డం క‌ష్టం అవుతుంద‌ని వైద్య‌నిపుణులు గ‌తంలో ప‌లుమార్లు తెలియ‌జేశారు.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గ్రామాల‌పైనే అధికంగా ఉండ‌టంతో అధికారులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  గ్రామాల్లోని ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తం కావ‌డంతో క‌రోనాను కొంత‌మేర అడ్డుకున్నారని చెప్పొచ్చు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-