క‌రోనా ప్ర‌భావంః  పాక్‌లో భారీగా పెరిగిన పేద‌రికం…

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌తేడాది చాలా కాలంపాటు ప్ర‌పంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ను విధించాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఈ లాక్‌డౌన్ కార‌ణంగా కోట్లాదిమంది ఉపాది అవ‌కాశాలు కోల్పోయారు.  ఉద్యోగాల‌ను పోగొట్టుకొని ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది.  దీంతో అనేక దేశాలు పేద‌రికంలో కూరుకుపోయాయి.  పొరుగు దేశం పాక్ ప‌రిస్థితులు మ‌రింత దుర్భ‌రంగా మారాయి.  క‌రోనా కార‌ణంగా పేద‌రికం భారీగా పెరిగింది.  

Read: అమల్లోకి ప్రధాని ఫ్రీ వ్యాక్సిన్‌ పాలసీ.. ఇంకా క్లారిటీ లేదు..!

2019లో పాక్‌లో పేద‌రికం 4.4 శాతం ఉండ‌గా, 2020లో అది 5.4 శాతానికి పెరిగినట్టు ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక‌లో పేర్కొన్న‌ది.  దాదాపుగా 40శాతం కుటుంబాల‌కు ఆహార‌భ‌ద్ర‌త కొర‌వ‌డిన‌ట్లు వ‌రల్డ్ బ్యాంక్ నివేదిక‌లో పేర్కొన్న‌ది. ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగితే పేద‌రికం మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉన్న‌ట్టు వ‌ర‌ల్డ్ బ్యాంక్ పేర్కొన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-