ఒక వైపు పండుగ సీజ‌న్‌…మరోవైపు క‌రోనా…

క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్న‌ప్ప‌టికీ… థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చిరిస్తున్నారు.  ప్రతిరోజూ 30 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండ‌డంతో ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. కేర‌ళ‌లో నైట్ క‌ర్ఫ్యూ విధించారు. ఇక కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై క‌ర్నాట‌క‌లో క్వారంటైన్ ఆంక్ష‌లు విధించారు.  కేర‌ళ నుంచి క‌ర్నాట‌క‌కు వ‌స్తే త‌ప్ప‌ని స‌రిగా వారం రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.  ఇక‌పోతే, మూడో వేవ్ సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నాటికి పీక్స్ స్టేజీకి చేరుకుంటుంద‌ని, కేసులు 5 ల‌క్ష‌ల వర‌కు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  మ‌రోవైపు పండుగ సీజ‌న్ మొద‌లైంది.  పండుగ సీజ‌న్‌లో ఒకే చోట‌కి ప్ర‌జ‌లు చేరుతుంటారు.  ముఖ్యంగా దేశాల‌యాల‌కు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది.  ఫ‌లితంగా క‌రోనా క్ల‌స్ట‌ర్‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.  క‌రోనా క్ల‌స్ట‌ర్లు ఏర్ప‌డితే మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేయ‌డం క‌ష్టం అవుతుంది.  అంతేకాదు, డెల్టాతో పాటు, డెల్టా ప్ల‌స్‌, ఇప్పుడు సీ 1.2 వేరియంట్‌లు భ‌య‌పెడుతున్నాయి.  ఈ మూడు కూడా చాలా డేంజ‌ర్ అని, వేగంగా వ్యాప్తి చెంద‌డ‌మే కాకుండా వ్యాక్సిన్ ను సైతం త‌ట్టుకొని క‌రోనా వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.  జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.  

Read: ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబ‌న్లు…పాలనపై మరోసారి అవే సంచలన వ్యాఖ్యలు…

Related Articles

Latest Articles

-Advertisement-