క‌రోనా క‌ల‌క‌లం: మొన్న పార్ల‌మెంట్‌, నిన్న సుప్రీంకోర్ట్‌… నేడు తీహార్ జైల్‌…

ఢిల్లీలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ప్ర‌తీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇటీవ‌లే పార్ల‌మెంట్‌లో 400 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్నా సిబ్బంది అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  దీంతో అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ప‌నిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.  సుప్రీంకోర్టులో దీనికోసం ప్ర‌త్యేక క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  

Read: మ‌నిషి 180 ఏళ్లు జీవించ‌డం సాధ్య‌మేనా…!!

కాగా, ఇప్పుడు తీహార్ జైల్లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  తీహార్ జైల్లోని 42 మంది ఖైదీలు, 34 మంది సిబ్బందికి క‌రోనా సోకంది.  అదే విధంగా ఢిల్లీలోని 66 మంది ఖైదీలు, 48 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  మండోలి జైలులో 24 ఖైదీలు 8 మంది జైలు సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.  క‌రోనా సోకిన ఖైదీలు, జైలు సిబ్బందికి ప్ర‌స్తుతం స‌ప‌రేట్‌గా ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

Related Articles

Latest Articles