కోవిడ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు నుమాయిష్ నిలిపివేత‌…

జ‌న‌వ‌రి 1 వ తేదీ నుంచి నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఎగ్జిబిష‌న్‌కు ఎలా అనుమ‌తులు ఇస్తార‌ని అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.  ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది నుమాయిష్‌ను చూసేందుకు వ‌స్తార‌ని,  కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో ఎగ్జిబిష‌న్‌ను నిర్వ‌హిస్తే వైర‌స్ మ‌రింత తీవ్రంగా వ్యాపించే అవ‌కాశం ఉంటుంద‌ని అనేక మంది ఫిర్యాదులు చేశారు.  బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీల‌పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిషేధం విధించింది.  ఈ నిషేధం జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది.   నిషేధం అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ నుమాయిష్‌ను ప్రారంభించ‌డంపై వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  

Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: బెంగాల్‌లో కొత్త ఆంక్ష‌లు… నేటి నుంచి…

నుమాయిష్‌ను జ‌న‌వ‌రి 10 వ తేదీ వ‌ర‌కు నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీచేసింది.  కోవ‌డ్ నిబంధ‌న‌లు అమ‌లులో ఉండ‌టంతో నుమాయిష్ ఎగ్జిబిష‌న్‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం.  నుమాయిష్‌లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.  నో మాస్క్ నో ఎంట్రీని అమ‌లు చేస్తున్నారు.  టీకా సెంట‌ర్‌ను కూడా ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు.  అయితే, ల‌క్ష‌లాది మంది ఈ ఎగ్జిబిష‌న్‌కు వ‌స్తారు కాబ‌ట్టి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. 

Related Articles

Latest Articles