కరోనా విలయం: ముంబైని మించిపోతున్న బెంగళూరు… 

కరోనా విలయం: ముంబైని మించిపోతున్న బెంగళూరు... 

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా 50 వేలకు పైగా కేసుకు నమోదయ్యాయి.  ఆంక్షలు, మినీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి విధించినా కరోనా  ఏ మాత్రం కట్టడి కావడం లేదు.  కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యా కూడా పెరుగుతున్నది.  రాజధాని బెంగళూరులో కేసులు నిన్న ఒక్కరోజు 23 వేలకు పైగా నమోదయ్యాయి.  ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.  కర్ణాటకలో 346 మంది మృతి చెందగా, బెంగళూరు 161 మరణాలు సంభవించాయి.  కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.  ఎప్పటి వరకు కేసులు తగ్గుముఖం పడతాయో చూడాలి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-