వెంటిలేటర్లు, ఆక్సిజన్ కు పెరుగుతున్న డిమాండ్…

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా, తీవ్ర‌త ఏమాత్రం త‌గ్గ‌లేదు.  లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో తిరిగి సాధార‌ణ జీవ‌నం ప్రారంభ‌మైంది.  రెండు వేవ్‌ల నుంచి తీవ్ర‌మైన పరిణామాలు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఏలాంటి మార్పు రాలేదు.  మాస్క్ లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.  దీంతో మ‌ళ్లీ దేశంలో క‌రోనా విజృంభిస్తున్న‌ది.  గ‌డిచిన 24 గంటల్లో ఇండియాలో 41 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  జూన్ నెల నుంచి కేసులు త‌గ్గ‌డంతో ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి త‌గ్గింది.  కాగా, ఇప్పుడు మ‌ర‌లా శ్వాస‌సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.  

Read: ‘కేన్స్’లో మెరిసిన రోబో బ్యూటీ !

థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఇప్ప‌టికే ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియోష‌న్ హెచ్చ‌రించింది.  మూడో వేవ్ అనివార్య‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పింది.  కానీ, అదే నిర్ల‌క్ష్యం కనిపిస్తున్న‌ది. దీంతో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  వెంటిలేటర్లు, ఆక్సీజ‌న్ అవ‌స‌రం క్ర‌మంగా పెరుగుతున్నట్టు వైద్య‌నిపుణులు చెబుతున్నారు.  స‌డ‌లింపులు ఇచ్చిన కొద్దిరోజుల‌కే ఇలా కేసులు పెరుగుతుంటే, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియోష‌న్ చెప్పిన‌ట్టుగా థ‌ర్డ్ వేవ్ తీవ్ర‌త అధికంగా ఉంటే ప‌రిస్థితి ఏంటి? 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-