షాకింగ్ న్యూస్‌: దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…మ‌ర‌ణాలు

ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి.  కొత్త‌గా దేశంలో 42,015 కేసులు న‌మోద‌వ్వ‌గా…3998 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  క‌రోనా కేసుల‌తో పాటుగా భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌డంతో తిరిగి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌నలు మొద‌ల్యాయి.  థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇలా కేసులు, మ‌ర‌ణాలు పెర‌గడంతో సాధార‌ణ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు.  ఈరోజు న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది.  

Read: చైనా మ‌రో ఆవిష్క‌ర‌ణ‌: గంట‌కు 600 కిమీ వేగంతో…

ఇందులో 3,03,90,687 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,07,170 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఈరోజు బులిటెన్ ప్ర‌కారం న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌తో క‌లిసి మొత్తం ఇండియాలో 4,18,480 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో 36,977 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 41,54,72,455 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-