సీఎంగా శివ.. బీజేపీ చీఫ్‌గా విష్ణు ఉన్నారు.. కరోనా ఏమీ చేయలేదు..!

కరోనా మహమ్మారి ఏ దేశాన్ని రాష్ట్రాన్ని వదలిపెట్టడం లేదు.. కాస్త అజాగ్రత్తగా ఉన్న ఏ వ్యక్తిని కూడా వదలకుండా పనిపట్టేస్తోంది… అయితే, ఆ మహమ్మారి ఏమీ చేయలేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్.. బీజేపీ కార్యకర్తల‌కు క‌రోనా వాలంటీర్లుగా ప‌నిచేసేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యకరమానికి హాజరైన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివుడు, పార్టీ చీఫ్‌గా విష్ణువు ఉండ‌గా ఇక మ‌ధ్యప్రదేశ్‌ను మ‌హ‌మ్మారి ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. కాగా, మ‌ధ్యప్రదేశ్ సీఎంగా శివ‌రాజ్ సింగ్ చౌహాన్ వ్యవహరిస్తుండగా.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుద‌త్ శ‌ర్మ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు.. మహారాష్ట్రలో ఈ సంవత్సరం జనవరి నుండి మే వరకు 3.28 లక్షల మరణాలు సంభవించాయని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డుతున్నారు.. కరోనా ఇంతటి కల్లోలం సృష్టించినా… బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తల నుండి ప్రశంసలు పొందడంలో మాత్రమే నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది… అయితే, “రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు మరియు ముఖ్యమంత్రి శివ్ అయిన మధ్యప్రదేశ్‌కు కరోనా ఎలా హాని చేస్తుంది” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. ఇక, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 135 కోట్ల డోస్ కోవిడ్ -19 టీకాలు దేశంలోని ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయని మిస్టర్ చుగ్ చెప్పారు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా బిజెపిపై విమర్శలు గుప్పించారు, తమ నాయకులు తమ పార్టీ కార్యకర్తల నుండి ప్రశంసలు పొందడానికి మాత్రమే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. మిస్టర్ గుప్తా ఈ సంవత్సరం జనవరి మరియు మే మధ్య మధ్యప్రదేశ్‌లో 3.28 లక్షల మంది మరణించారు, ఇది సాధారణ మరణాల రేటు కంటే 54 శాతం ఎక్కువ అని దుయ్యబట్టారు.. కాగా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసే అధికార కరోనా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,91,960కి చేరుకోగా.. ఇప్పటి వరకు 10,514 మంది కోవిడ్‌తో మరణించారు.

-Advertisement-సీఎంగా శివ.. బీజేపీ చీఫ్‌గా విష్ణు ఉన్నారు.. కరోనా ఏమీ చేయలేదు..!

Related Articles

Latest Articles