-
కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 3320 కరోనా కేసులు, 95 మరణాలు. ఇండియాలో 59,662కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.
-
ఢిల్లీ: కరోనా హెల్త్ బులిటెన్ విడుదల. గత 24 గంటల్లో 2644 కేసులు, 83 మరణాలు. దేశవ్యాప్తంగా 39,980 కరోనా కేసులు నమోదు.
- భారత్ లో ఇప్పటి వరకు 26,496 కరోనా కేసులు నమోదు. కరోనాతో 824 మంది మృతి. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 5,803. గత 24 గంటల్లో ఇండియాలో 1994 కరోనా కేసులు నమోదు. 47 మరణాలు.
- నేడు విజయవాడలో మాంసం విక్రయాలు బంద్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారుల నిర్ణయం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరిపైన మాంసం విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
- 24 గంటల్లో 6,928 నమూనాలు పరీక్షిస్తే 61 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు ఏపీలో 61,216 టెస్టులు చేశాం. ప్రతి 10 లక్షల మందిలో 1147 మందికి పరీక్షలు. ఏపీలో పాజిటివ్ రేటు 1.66 గా ఉంది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. శ్రీకాకుళంలో తొలిసారి 3 కరోనా కేసులు వచ్చాయి - ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
ఏపీలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
- రాష్ట్రంలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు
- ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 813
- గత 24 గంటల్లో 56 కొత్త కేసులు, ఇద్దరు మృతి
- గుంటూరు, కర్నూలులో కొత్తగా 19 చొప్పున కేసులు
- ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 24
సూర్యాపేట డీఎంహెచ్‌వోపై వేటు
- సూర్యాపేటలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ నిరంజన్‌పై వేటు
- నూతన డీఎంహెచ్‌వోగా డాక్టర్ సాంబశివరావు నియామకం
- గతంలో యాదాద్రి జిల్లాలో విధులు నిర్వహించిన సాంబశివరావు
కరోనా హెల్త్ బులెటిన్ విడుదల
- గడిచిన 24 గంటల్లో 1,383 కొత్త కేసులు, 50 మరణాలు
- భారత్‌లో 19,984కు చేరిన పాజిటివ్ కేసులు
- ఇప్పటి వరకు 640 మంది మృతి
తెలంగాణలో ఇవాళ కొత్తగా మరో 18 కరోనా కొత్త కేసులు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 858 కి చేరింది. ఇప్పటి వరకు తెలంగాణలో 21 మంది మరణించారు. కరోనా సోకిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజుల సమయం పట్టింది - కేసీఆర్
- కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ మీటింగ్. మే 7 వరకు తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం. ఫుడ్ డెలివరీ సర్వీసులు కూడా అనుమతించకూడదనే యోచనలో సర్కార్.
- భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు. భారత్ లో 15,712కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు. ఇండియాలో ఇప్పటి వరకు 507 మరణాలు. గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కేసులు, 27 మరణాలు.
- తెలంగాణలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో 809 కి చేరిన పాజిటివ్ కేసులు. ఇవాళ ఒక్క రోజే హైదరాబాద్ లో 31 కరోనా కేసులు నమోదు.
- దేశవ్యాప్తంగా కరోనా అత్యవసర హెల్ప్ లైన్లు. బ్లడ్ శాంపిల్స్ సేకరణకు మొబైల్ టీమ్. భారత్ లో 14,378కి చేరిన కరోనా కేసులు. భారత్ లో ఇప్పటి వరకు 480 మంది మృతి. గడిచిన 24 గంటల్లో 991 కేసులు, 43 మరణాలు.
- తెలంగాణలో మెడికల్ షాపులను ఫీవర్ సర్వైలెన్స్ లోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం. జ్వరం, గొంతునొప్పి మెడిసిన్ కొనుగోలు చేసేవారి వివరాలను సేకరించాలని మెడికల్ షాపులకు ఆదేశం.
- పాక్ ప్రధాని ఇమ్రాన్ సర్కార్ మాట వినని ముల్లాలు.. యధావిధిగా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలు.
ఏపీలో కొత్తగా 9 కేసులు..
- రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో 534కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య
- కొత్తగా కర్నూలులో 3, ప.గో.లో 3, కృష్ణా జిల్లాల్లో 3 కేసులు
-
లాక్ డౌన్ ను పొడిగించాలని అంతా అడుగుతున్నారు. ముఖ్యమంత్రులతో చర్చించి ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగైంది. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన కీలక దశలో ఉన్నాం. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి - కిషన్ రెడ్డి
-
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు. 17 లక్షలకు చేరువలో బాధితుల సంఖ్య. లక్షా రెండు వేలు దాటిన కరోనా మరణాలు.
-
ఏపీలో 133 కరోనా రెడ్ జోన్లు. నెల్లూరులో అత్యధికంగా 30 రెడ్ జోన్లు. కర్నూలులో 22, కృష్ణా జిల్లాలో 16, గుంటూరులో 12, ప.గో.జిల్లాలో 12, ప్రకాశంలో 11,తూ.గో.జిల్లాలో 8, చిత్తూరులో 7, విశాఖలో 6, కడపలో 6, అనంతపురంలో 3 రెడ్ జోన్లు గుర్తింపు.
-
కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ. భారత్ లో పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 678 కొత్త కరోనా కేసులు. 33 మరణాలు. భారత్ లో మొత్తం 6412 కరోనా పాజిటివ్ కేసులు. 199 మరణాలు.
-
ఏపీలో 226 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన 12 గంటల్లో 34 పాజిటివ్ కేసులు నమోదు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 34 కరోనా కేసులు. ఒకే రోజులో కర్నూలులో 23, చిత్తూరులో 7, ఒంగోలులో 2,నెల్లూరులో 2 కొత్త కేసులు.
-
ఢిల్లీ: మరో ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్. ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 120.
-
రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారికి వైరస్ సోకింది. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తిస్తున్నాం. వైరస్ సోకితే ఏదో జరిగిపోతుందని భయపడొద్దు-సీఎం వైఎస్ జగన్
-
తెలంగాణ నుంచి మార్కజ్ కు 1200 మంది వెళ్లారు. అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఆరుగురు చనిపోయారు. జమాత్ ప్రార్ధనలకు వెళ్లొచ్చిన మరో 160 మంది కోసం గాలింపు. గాంధీలో మరో 10 మంది కరోనా బాధితులకు నెగెటివ్ వచ్చింది. మరోసారి వారికి పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపుతాం. ఈరోజు గాంధీ నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు - ఈటల రాజేందర్
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. సీఎంలతో రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న మోడీ. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలుపై చర్చించనున్న ప్రధాని మోడీ.
-
ఏపీలో విజ్రుంభిస్తున్న కరోనా..పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే సారి 14 పాజిటివ్ కేసులు నమోదు..బాధితులు అంతా ఢిల్లీ వెళ్లివచ్చిన వారే..ఏపీలో 58కి చేరిన కౌంట్
-
ఏలూరులో 8, భీమవరంలో 2, ఉండి 1, గుండుగొలను 1, నారాయణపురం 1, పెనుగొండ 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు
-
తెలంగాణలో ఇవాళ మరో 15 పాజిటివ్ కేసులు నమోదు. మార్కజ్ నుంచి వచ్చిన వాళ్ళలో 15 మందికి పాజిటివ్. తెలంగాణలో ప్రస్తుతం 77 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మార్కజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ పరీక్ష చేయించుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్నవారిని బంధువులు పరీక్షలకు తీసుకురావాలి - ఈటెల
-
తెలంగాణలో పాజిటివ్ కేసులు తగ్గాయి. ఉద్యోగుల జీతాల కోత తాత్కాలికమే. పరిస్థితి అదుపులోకి వచ్చాక జీతాలిస్తాం. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికోసం స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశాం. లాక్ డౌన్ పొడిగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు - సీఎస్ సోమేష్ కుమార్
-
బిఆర్కే భవన్ లో కరోనా కల్లోలం. ఇటీవలే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన సచివాలయ ఉద్యోగి. ఢిల్లీ వెళ్లొచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచిన ఏ.ఎస్.వో. నిన్నటి వరకు సచివాలయంలో విధులకు హాజరైన ఎస్.ఎస్.వో. ఐఏఎస్ లతో పాటుగా అన్ని సమావేశాలకు హాజరైన ఉద్యోగి.
-
గత 24 గంటల్లో 227 పాజిటివ్ కేసులు నమోదు. ప్రైవేట్ ల్యాబ్స్ తో సంప్రదిస్తున్నాం. ఇతర దేశాల వైద్యసాయం కోరుతున్నాం. కరోనాపై 15వేలమంది నర్సులకు శిక్షణ. వైద్యులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు. విదేశాల నుంచి వైద్య పరికరాలు తెప్పిస్తున్నాం. ప్రజలు ఆందోళన చెందొద్దు. కరోనాపై ఎయిమ్స్ తో కలిసి పనిచేస్తున్నాం. దేశవ్యాప్తంగా 21 వేల శిబిరాలు - కేంద్ర ఆరోగ్యశాఖ
- ఢిల్లీలో జమాతే ప్రార్థనలకు తెలంగాణ నుంచి 1030 మంది హాజరు. హైదరాబాద్ నుంచి 603 మంది వెళ్లి వచ్చినట్టు నిర్ధారణ. ఇప్పటికే చాలామందిని గుర్తించి పరీక్షలు నిర్వహించిన అధికారులు.
- మహారాష్ట్రలో 230, కేరళలో 222,ఢిల్లీలో 97, కర్ణాటకలో 98, గుజరాత్ లో 70, తమిళనాడులో 98, తెలంగాణలో 76, రాజస్థాన్ లో 96, పంజాబ్ లో 41 కరోనా కేసులు నమోదు.
- కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తెలంగాణ. తెలంగాణలో మొత్తం 77 పాజిటివ్ కేసులు నమోదు. ఇవాళ తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు, ఒకరు మృతి. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరి మృతి.
- దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో కరోనా విజృంభణ. కర్ణాటకలో 88 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. మహారాష్ట్రలో 215, యూపీలో 88, ఢిల్లీలో 72, తెలంగాణలో 70, గుజరాత్ లో 69, రాజస్తాన్ లో 69, తమిళనాడులో 67 పాజిటివ్ కేసులు.
- కేరళలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. ఇవాళ ఒక్కరోజే కేరళలో 32 పాజిటివ్ కేసుల నమోదు. కేరళలో 234 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.
- భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 867..మహారాష్ట్రలో 196 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- భారత్ లో 979కి చేరిన కరోనా కేసులు..25కు చేరిన కరోనా మృతుల సంఖ్య
- కరోనా బాధితుల కోసం కింగ్ కోటి ఆసుపత్రి సిద్దం..350 పడకలతో ఆసుపత్రిని సిద్దం చేశామన్న కేటీఆర్..త్మరలో మరో నాలుగు ఆసుపత్రులు సిద్దం
- కరోనా విషయంలో తెలంగాణాకి ఊరట..శుభవార్త అంటూ షేర్ చేసిన కేటీఆర్...కోలుకున్న 11 మంది కరోనా బాధితులు.. తెలంగాణాలో నమోదయిన 11 మంది పాజిటివ్ కేసులలో నేడు నెగటివ్ రిపోర్టులు : కేటీఆర్
- అమరావతి: కరోనాపై ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల. రాత్రి నుంచి కొత్తగా నమోదుకాని పాజిటివ్ కేసులు. ఏపీలో ఇప్పటి వరకు 19 కరోనా కేసులు నమోదు. 512 మందికి కరోనా పరీక్షలు. 433 మందికి నెగెటివ్. 60 మంది రిపోర్టుల కోసం చూస్తున్న వైద్యులు.
- ఇటలీలో ఒక్క రోజులోనే 5974 కేసులు.. 889 మరణాలు. ఇటలీలో మొత్తం బాదితుల సంఖ్య 92, 472. స్పెయిన్ లో 73 వేలు దాటిన కరోనా కేసులు. ఆరు వేల మరణాలు.
కరోనా విలయతాండవం
- కరోనా కోరల్లో అగ్రరాజ్యం విలవిల
- “కోవిడ్-19” కేసుల్లో అమెరికా అగ్రగామి
- “కరోనా” మరణాల సంఖ్యలో ఇటలీ ప్రధమ స్థానం
- గంటల వ్యవధిలో వేల సంఖ్యలో కేసుల నమోదు.
- లక్ష కేసులను దాటి ప్రపంచంలో అగ్రస్థానంలో అమెరికా.
- 86,498కేసుల నమోదుతో ద్వితీయ స్థానంలో ఇటలీ.
- “కోవిడ్-19” కేసుల సంఖ్యలోనూ చైనాను అధిగమించిన ఇటలీ.
- ఆ తర్వాతి స్థానాల్లో చైనా (81,394), స్పెయిన్ (65,719), జెర్మనీ (50,871).
- కరోనా మరణాల కేసులో అగ్రస్థానంలో ఇటలీ (9,134)
- ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు..650 దాటిన కరోనా కేసులు..13 మంది మృతి..
- కేరళ, మహారాష్ట్రలో అత్యదిక కేసులు..కర్నాటకలో ఒక్కరోజే పది కేసులు
- మరికాసేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం..
- ఎకనామిక్ రిలీఫ్” ప్యాకేజిని ప్రకటించనున్న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ !..
- సోనియా లేఖ నేపధ్యంలో సమావేశం మీద ఆసక్తి..
- కరోనా పై పోరాటానికి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల చొప్పున విరాళం అందజేసిన పీవీ సింధు
- మళ్ళీ జర్నలిస్టుల మీద పోలీసుల దాడి..
- కృష్ణా జిల్లాలో దాడి చేసిన పోలీసులు..
- అనుమతి ఉన్నా పట్టించుకోకుండా దాడులు
- కరోనా మీద యుధ్ధానికి సినీ ప్రముఖుల ఆపన్న హస్తం..
- రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో పదిలక్షలు ప్రకటించిన త్రివిక్రమ్...
- చెరో ఐదు లక్షలు ప్రకటించిన అనిల్ రావుపూడి
- సాయంత్రం ఐదు గంటలకి కరోనా వైరస్ గురించి ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్
- తమకు ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసినా వినడం లేదంటున్న వాహనాదారులు..
- చెక్‌పోస్ట్ ల వద్ద భారీగా నిలిచిన వాహనాలు..
- ఏపీలో అడుగు పెట్టాలంటే 14 రోజులు క్వారెంటైన్ కి వెళ్ళాల్సిందే
- ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత..
- గుంటూరు జిల్లా దాచేపల్లి, కృష్ణా జిల్లా తిరువూరు వద్ద భారీగా ట్రాఫిక్ జాం..
- తెలంగాణా నుండి వచ్చే ప్రతి వాహనాన్ని అడ్డుకుంటున్న పోలీసులు
- కరోనా సహాయక చర్యల కోసం ఆర్ధిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్..
- పీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి,
- రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరో యాభై లక్షల సాయం ప్రకటన
- ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్న విద్యార్థులు..
- హాస్టల్ లోనే విద్యార్థులు ఉండాలని అక్కడే అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిన పోలీసులు....
- ప్రస్తుతం పాసుల జారీనీ పూర్తిగా నిలిపివేసిన పోలీసులు
- ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు..
- 649కి చేరిన కరోనా కేసులు..12 మంది మృతి..
- కేరళ, మహారాష్ట్రలో అత్యదిక కేసులు..
- అమెరికాలో విజ్రుంభిస్తున్న కరోనా మహమ్మారి.
- .వెయ్యి దాటిన కరోనా మారణాలు..
- నిన్న ఒక్కరోజే 11వేల కేసులు, 155 మరణాలు..
- రిటైర్డ్ వైద్యులు రంగంలోకి దిగాలని ఆర్మీ పిలుపు
- ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..
- విజయవాడకు చెందిన ఇద్దరికీ కరోనా పాజిటివ్..
- ఏపీలో పదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- తెలంగాణలో మరో రెండు కేసులు..41కి చేరిన కేసులు.
- .సౌదీ నుంచి 3 సంవత్సరాల బాబుకు కరోనా..
- తెలంగాణాలో మరో ప్రైమరీ కాంటాక్ట్ కేసు నమోదు
- తెలంగాణా ఏపీ బోర్డర్ చెక్ పోస్ట్ ల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు..
- హైదరాబాద్ పోలీసుల ఎన్ఓసీతో బోర్డర్ చేరిన వాహనదారులు..
- వారిని రాష్ట్రంలోకి అనుమతించని ఏపీ పోలీసులు
- కాశీలో చిక్కుకున్న తెలంగాణ వాసులు..
- కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన తెలంగాణ వాసులు..
- కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకున్న తెలంగాణ వాసులు
- జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష...
- కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై చర్చ,
- నైట్ షెల్టర్స్ పరిశీలించిన మంత్రి...
- రూ.5 భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశం
హైదరాబాద్
- అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా..
- షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 12న పరీక్ష...
- 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా వేస్తూ ప్రకటన
హైదరాబాద్
- కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ అగ్నిమాపక శాఖ..
- సోడియం హైపో క్లోరైడ్ ను బహిరంగ ప్రదేశాల్లో చల్లుతూ వైరస్ వ్యాప్తి నిరోదానికి చర్యలు
హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించే అవకాశం
- ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం..
- పాల్గొన్న వైద్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ కార్యదర్శులు..
- మరింత కఠినంగా లాక్ డౌన్ రూల్స్ అమలు..
- హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించే అవకాశం..
- ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే పరిస్థితి ఏమిటనే దాని మీద చర్చ
కరీంనగర్లో ఉచితంగా కూరగాయలు
- రెడ్ జోన్లో ఉచితంగా కూరగాయల పంపిణీ
- ముకరంపురా, భగత్ నగర్, కశ్మీర్‌గడ్డ ప్రాంతాలకు కూరగాయల పంపిణీ
- ప్రతి ఇంటికీ 6 కిలోల కూరగాయలను పంపిణీ చేసిన మేయర్ సునీల్ రావు
కరోనా కట్టడికి కదులుతోన్న గ్రామాలు..
- ఆదిలాబాద్ జిల్లా గ్రామాల్లో వెల్లువిరిసిన చైతన్యం
- 70 గ్రామాల్లో తీర్మానం.. తమ గ్రామాల్లోకి ఇతరులు రాకూడదంటూ తీర్మానం
- జిల్లాలో మొత్తం 1161 గ్రామాలు
- ఉదయం నుంచి కొనసాగుతున్న తీర్మానాలు
- చాలా గ్రామాల్లో నో ఎంట్రీ బోర్డులు
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
- టెన్త్ పరీక్షలను రెండు వారాలపాటు వాయిదా వేసిన అధికారులు
- ఈ నెల 31 తర్వాత పరిస్థితి ఆధారంగా పరీక్షల తేదీల ప్రకటన-విద్యాశాఖ మంత్రి సురేష్
కరీంనగర్ అష్టదిగ్బంధనం
- నిన్న ఇండోనేషియా బృందంతో తిరిగిన స్థానిక వ్యక్తికి కరోనా పాజిటివ్
- నగరం సరిహద్దులన్నీ మూసివేత
- పలు ప్రాంతాలు రెడ్ జోన్లుగా ప్రకటించిన అధికారులు
- కలెక్టరేట్ చుట్టూ ప్రాంతాల్లో భారీ కేడ్లతో రాకపోకలు నిలిపివేత
- ఇండోనేషియా బృందం తిరిగిన ముకరంపురా, కలెక్టరేట్, కశ్మీర్ గడ్డ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్క్రీనింగ్
- కర్ఫ్యూ సడలింపు సమయంలోనే ప్రజలు బయటకు రావాలని సూచన
విజయవాడలో పచారీ కోట్లు ఫుల్
- ఇళ్ల దగ్గర, ప్రధాన మార్కెట్లు, సూపర్ బజార్లల్లో ఉదయం 6 గంటల నుంచి కిటకిటలాడుతున్న ప్రజలు
- 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అవకాశం
- సమయం తక్కువ ఉండటంతో పచారీ షాపులకు జనం తాకిడి
కఠినంగా లాక్డౌన్..
- ప్రజలను రోడ్లపైకి అనుమతించవద్దని కలెక్టర్లకు తెలంగాణ సీఎఎస్ ఆదేశాలు
- బయట తిరిగితే జైలుకే -మంత్రి ఈటల రాజేందర్
- ఇండియాలో 433కు చేరిన కరోనా కౌంట్
- హైదరాబాద్ లో 948 ఆటోలు సీజ్..
- రాత్రుళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండనున్న పోలీసులు..
- కార్లు, ద్విచక్ర వాహనాలు కనిపిస్తే ఆపేస్తామని హెచ్చరిక
- మహారాష్ట్రలో 97కు చేరిన కరోనా కౌంట్..
- కొత్తగా పాజిటివ్ వచ్చిన ఎనిమిది కేసులు
- ఏపీలో కరోనా మెట్టమెదటి పాజిటివ్ కేసుగా నమోదు అయిన యువకుడు అసుపత్రి నుంచి డిశార్జి
- మరో 14 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని తెలిపిన వైద్యులు
- లాక్ డౌన్ నిభందనల జీవోను విడుదల చేసిన తెలంగాణా సర్కార్..
- బైక్ మీద ఒకరికి, కార్ లో ఇద్దరికి మాత్రమే అనుమతి..
- సాయంత్రం ఏడు నుండి ఉదయం ఆరు వరకు మెడికల్ ఎమర్జన్సీకి మాత్రమే అనుమతి..
- ఆసుపత్రులు, మెడికల్ షాపులకి మాత్రమే సా.6 తర్వాత అనుమతి..
- 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న షాపుల్లోనే నిత్యావసరాలు కొనాలి..
- అనుకూల ప్రదేశాల్లో తాత్కాలిక పోలీస్ చెక్ పోస్టులు
- LOCK OUT అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య..ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలి..నువ్వు బ్రతకడానికి, తోటివారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిందే : కేటీఆర్
- .తెలంగాణాలో 33కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు : మంత్రి ఈటెల
-
హైదరాబాద్: రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు. బైక్ పై ఒకరికంటే ఎక్కువ వస్తే సీజ్. ఫోర్ వీలర్ పై డ్రైవర్ తో పాటు మరొకరు మాత్రమే ఉండాలి. అత్యవసర సర్వీసులు మాత్రమే అనుమతిస్తాం. హోటల్స్ లో తినడానికి అనుమతి లేదు. పార్సిళ్లు మాత్రమే తీసుకోవాలి. బయటకు ఎవరు వచ్చినా చర్యలు తప్పవు - సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ.
-
తెలంగాణలో 30కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఒక్కరోజే మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన 21 ఏళ్ల వ్యక్తికి కరోనా. లండన్ నుంచి మరో 30 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్. ఇండోనేషియా బృందానికి ఆశ్రయమిచ్చిన కరీంనగర్ వాసికి కరోనా.
- హైదరాబాద్: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్. రోడ్లపైకి ఆటోలు, క్యాబ్ లు వస్తే సీజ్. రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్న పోలీసులు. దుకాణాలను మూసివేయిస్తున్న అధికారులు.
తెలంగాణలో మరో కరోనా కేసు
- రాష్ట్రంలో 28కి చేరిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య
- కరీంనగర్లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు
- ఇండోనేషియా వారితో కలిసి తిరిగినందుకు కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రకటన
కరోనా షట్‌డౌన్ ఎఫెక్ట్...
- తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కూరగాయల ధరలు
- ఇష్టారాజ్యంగా కూరగాయల ధరలు పెంచిన వ్యాపారులు
- హైదరాబాద్ సరూర్‌నగర్ రైతు బజార్లో గొడవ
- చేతులెత్తేసిన మార్కెట్ అధికారులు
- వ్యాపారులతో ఘర్షణకు దిగిన జనం
స్టాక్ మార్కెట్లకు వర్తించని ముంబై లాక్డౌన్
- నేటు యథావిథిగా పనిచేయనున్న సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ
- అన్ని విభాగాల్లో యథావిథిగా ట్రేడింగ్ జరుగుతుందని ప్రకటన
ఇటలీకి భారత్ సాయం...
- కరోనాతో సతమతం అవుతోన్న ఇటలీకి భారత్ సాయం
- వైద్య పరికరాలు, మాస్క్‌లు పంపించిన భారత్
- భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇటలీ సర్కార్
విజృంభిస్తూనే ఉన్న కరోనా
- కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 14,613 మంది మృతి
- ప్రపంచవ్యాప్తంగా 3.36 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
- భారత్‌లో 396 కరోనా పాజిటివ్ కేసులు
- భారత్‌లో ఏడుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
- మార్చి 31 వరకు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్. తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్. ఆంధ్రప్రదేశ్ లో పాక్షితం. తెలంగాణలో ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలు పూర్తిగా బంద్. ఏపీలో షరతులతో పరిమిత స్థాయిలో ఆటోలు, టాక్సీలకు అనుమతి.
- ఏపీలోని ఆరు పాజిటివ్ కేసుల్లో ఒకరికి పూర్తిగా నయం అయ్యింది. కరోనా నిర్మూలనకు కృషి చేస్తున్న అందరికి అభినందనలు. వలంటీర్ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్ చేసి స్కాన్ చేశాం. ప్రతి నియోజక వర్గంలో వంద పడకల ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు - ఏపీ సీఎం జగన్
- నెలకు సరిపడ రేషన్ బియ్యం అందిస్తాం. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు అన్నింటికీ నెలకు రూ.1500 ఇస్తాం- కేసీఆర్
- దురదృష్ట వశాత్తూ ఇవాళ కూడా ఐదు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ ఐదుగురు కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ్టితో విదేశాల నుంచి విమానాలు బంద్. మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్. ప్రజలెవరూ ఇళ్లుదాటి బయటకు రావొద్దు. ఐదుగురికి మించి ప్రజలెవరూ గుమిగూడొద్దు. అత్యవసర సరుకుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలి.
- జనతా కర్ఫ్యూ చాలా అద్భుతంగా జరిగింది. ప్రజలు చాలా చక్కగా స్పందించారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. దేన్నైనా ఎదుర్కొనగలమనే సంఘీభావ సంకేతాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
- కేంద్రం ప్రకటించిన 75 లాక్ డౌన్ జిల్లాల్లో ఏపీలోమూడు జిల్లాలు. ప్రకాశం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో మార్చి31వరకు లాక్ డౌన్. కేంద్రం జాబితాలో తెలంగాణలోని ఐదు జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మార్చి31 వరకు లాక్ డౌన్.
- సా 4 గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం. తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించే అవకాశం.
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు. కరోనా పాజిటివ్ తేలిన 75 జిల్లాల్లో 31 వ తేదీ వరకూ లాక్ డౌన్ కు ఆదేశాలు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీతో కేంద్ర కెబినెట్ సెక్రటరీ, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్. అంతరాష్ట్ర బస్ సర్వీసులను 31 వరకు నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన. ఢిల్లీ మెట్రో సహా అన్ని రాష్ట్రాల మెట్రోలు ఆపాలని కేంద్రం ఆదేశం.
అమరావతి
- జనతా కర్ఫ్యూను పాటిస్తోన్న మంత్రులు.
- రోజూ వారీ కార్యకలాపాలకు దూరంగా మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి.
- కార్టకర్తలను.. అధికారులకు దూరంగా ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తోన్న మంత్రులు.
- కుటుంబ సభ్యులతో గడుపుతోన్న మంత్రులు.
- ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని మంత్రుల సూచన.
కరోనా దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం..ఈ నెల 31 వరకు అన్ని రైళ్ళ రద్దు..కేవలం గూడ్స్ రైళ్ళకే పర్మిషన్ #CoronavirusOutbreakindia #CoronaVirusUpdate #JanataCurfewon22ndmarch #NTVTelugu #NTVNews #coronavirus #COVID19outbreak
— NTV Breaking News (@NTVJustIn) March 22, 2020
తెలంగాణాలో మరో పాజిటివ్ కేసు...22కు చేరిన కౌంట్..హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న గుంటూరు యువకుడు..#CoronavirusOutbreakindia #CoronaVirusUpdate #JanataCurfewon22ndmarch #NTVTelugu #NTVNews #coronavirus #COVID19outbreak
— NTV Breaking News (@NTVJustIn) March 22, 2020
ఇండియాలో ఆరుకు చేరిన కరోనా మృతులు...బిహార్ లో మరణించిన 38 ఏళ్ళ యువకుడు..ఈరోజే ముంబైలో మరణించిన మరో వ్యక్తి#CoronavirusOutbreakindia #CoronaVirusUpdate #JanataCurfewon22ndmarch #NTVTelugu #NTVNews #coronavirus #COVID19outbreak
— NTV Breaking News (@NTVJustIn) March 22, 2020
హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఏడుగురు కరోనా అనుమానితులు..దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఏడుగురు #CoronavirusOutbreakindia #CoronaVirusUpdate #JanataCurfewon22ndmarch #NTVTelugu #NTVNews #coronavirus #COVID19outbreak
— NTV Breaking News (@NTVJustIn) March 22, 2020
దేశంలో మరో కరోనా మరణం..ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి మృతి..మహారాష్ట్రలో రెండో కరోనా మరణం..దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువ పాజిటివ్ కేసులు #CoronavirusOutbreakindia #CoronaVirusUpdate #JanataCurfewon22ndmarch #NTVTelugu #NTVNews #coronavirus #COVID19outbreak
— NTV Breaking News (@NTVJustIn) March 22, 2020
అమరావతి
- ఏపీ ప్రభుత్వోద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం.
- 50 శాతం మంది ఉద్యోగులు రోటేషన్ పద్దతిన వారం విడిచి వారం కార్యాలయాల నుంచి పని చేసేలా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.
- సెక్రటేరియేట్ మొదలుకుని మండల స్థాయి ఉద్యోగుల వరకు వర్క్ ఫ్రమ్ హోం వర్తింపు.
- 60 ఏళ్ల పైబడి ఉన్న సలహాదారులు, ఛైర్ పర్సన్లు, కన్సల్టెంట్లు హెచ్‌వోడీల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోం అమలుకి గ్రీన్ సిగ్నల్.
- వచ్చే నెల నాలుగో తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోం ఉత్తర్వులు వర్తింపు.
- జలుబు, దగ్గు, షుగర్, ఆయాసం వంటి వాటితో ఇబ్బంది పడుతూ సెల్ఫ్ క్వారైంటనుకు వెళ్లాలనుకునే 50 ఏళ్లకు పైబడే ఉద్యోగులకు వచ్చే నెల నాలుగో తేదీ వరకు శెలవులు.
- అత్యవసర సేవల విభాగాల్లో ఉండే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వర్తించదని స్పష్టీకరణ.
- ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణను తాత్కాలికంగా నిలిపేస్తూ ఉత్తర్వులు.
కడప జిల్లా..
- జిల్లాలో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ..
- జిల్లా వ్యాప్తంగా స్తంభించిన రవాణా రంగం..ఆగిపోయిన బస్సు, రైళ్ల సర్వీసులు..
- డిపోలకే పరిమితమైన బస్సులు..ప్రయాణీకులు లేక బోసిపోయిన బస్టాండు, రైల్వే స్టేషన్లు..
- ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బంద్..
- ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు..
- పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారు బయటకు రావొద్దంటూ హెచ్చరికలు..
- అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దంటూ కలెక్టర్ సూచన..
శ్రీకాకుళం
- శ్రీకాకుళం జిల్లాలో మొదలైన జనతా కర్ఫ్యూ
- జనతా కర్ఫ్యూ పాటిస్తూ ఇళ్లకే పరిమిత సిక్కోలు వాసులు
- దూరప్రాంతాల నుంచి శ్రీకాకుళం నగరానికి ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో చేరుకుంటున్న అరకొర ప్రయాణీకులు మినహా రోడ్ల పై కనిపించని జనసంచారం
జనతా కర్వ్యూ @ తమిళనాడు
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల హోటల్స్ బంద్...
- ఒక్క చెన్నైలో యాబై ఐదు హోటల్స్ బంద్...
- చెన్నై కోయంబేడు మార్కెట్ కు సెలవు...
- రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, పార్క్ లు బంద్..
- మెరినా బీచ్ సహా అన్ని బీచ్ లు మూసివేత...
- కర్నాటక, ఏపి,కేరళ సరిహద్దులు మూసివేత..
పుదుచ్చేరి ...
- కరోనా వైరస్ వ్యాప్తి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ...
- ప్రారంభం అయినా జనతా కర్వ్యూ ను మార్చి 31 తేది వరకు కొనసాగింపు : సిఎం నారాయణ స్వామీ...
- ప్రజలు నిత్యవసర సరుకులు కొనడానికి ఉదయం 8-9 వరకు, సాయంత్రం 6- 7 వరకు సమయం కేటాయింపు
విజయవాడ
- బెజవాడలో జనతా కర్ఫ్యూ ప్రభావం
- పాలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు షాపులు తప్ప మిగతావన్నీ బంద్
- నిర్మానుష్యంగా మారిన బెజవాడ రోడ్లు
- డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు
- గన్నవరం విమానాశ్రయం నుంచి అందుబాటులో ఉన్న 8 విమాన సర్వీసులు
అనంతపురం :
- ప్రధాని మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో భాగంగా గుంతకల్ రైల్వే డివిజన్ లో 42 ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు.
- జనతా కర్ఫ్యూలో భాగంగా పెనుకొండ లోని కియా పరిశ్రమలో పనుల ఆపివేత.
నెల్లూరు
- జనతా కర్ఫ్యూ నేపథ్యంలో చెన్నై-కలకత్త జాతీయ రహాదారిలో ఎక్కడికక్కడ అగిన వాహానాలు, స్వచ్చందంగా అపివేసిన వాహనదారులు.
- జనతా కర్ఫ్యూ నేపథ్యంలో చర్చీలలో తెల్లవారుజామున ప్రార్థనలు నిర్వహించిన నిర్హవాకులు.
తూర్పుగోదావరి జిల్లా :
- జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు.. ఈ నెల 18 న లండన్ నుంచి రాజమండ్రి వచ్చిన 22 ఏళ్ల యువకుడు..
- కరోనా పాజిటివ్ కేసు తో రాజమండ్రిలో బాధితుని నివాస ప్రాంతంలో హై అలర్ట్..
- బాధితుడిని కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలింపు
- కాకినాడ ఐసోలేషన్ వార్డులో చికిత్సనందిస్తోన్న వైద్యులు,.
తిరుపతి
- తిరుపతి విమానాశ్రయానికి నిత్యం 14 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తుండగా జనతా కర్ప్యూ నేపథ్యంలో మూడింటికే పరిమితం చేసిన అధికారులు...
- ట్రూజెట్ 2, ఇండిగో 4, స్టార్ ఎయిర్ ఒకటి, స్త్పెస్ జెట్ 4 సర్వీసులను నిలిపివేత.
- ఎయిర్ ఇండియాకు చెందిన 2, ఇండిగో విమానం సర్వీసు మాత్రం అనుమతి..
- తిరుపతికి వచ్చే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 19 ప్యాసింజర్ రైళ్లను రద్దు.
- తిరుపతి మీదుగా ప్రతిరోజూ 80 రైళ్లు రాకపోకలు
- ప్రతినిత్యం 70 వేల మంది యాత్రికులను తరలిస్తూ రూ.35 నుంచి రూ40 లక్షల వరకు రాబడిని గడిస్తున్న తిరుపతి రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా మారింది.
- నగరంలోని ఐదు వేల హోటల్స్ బంద్
- జిల్లా వ్యాప్తంగా 110 సినిమా హాల్సు మూసివేత.
- సకలం బంద్
అమరావతి
- కరోనా బులెటిన్ విడుదల చేసిన ఏపీ వైద్యారోగ్య శాఖ.
- ఏపీలో ఐదు పాజిటీవ్ కేసులు.
- విదేశాల నుంచి 12953 మంది ఏపీకి వచ్చినట్టు గుర్తింపు.
- 10,841 మంది హోమ్ ఐసోలేషనులో పర్యవేక్షణ.
- 60 మందికి ఆస్పత్రిలో చికిత్స.
- 160 మంది శాంపిళ్ల పరిశీలన.
- 130 నెగిటీవ్ కేసులుగా నిర్దారణ.
- ఇంకా 25 మంది శాంపిల్సుకు సంబంధించిన రిపోర్టుల కోసం వేచి చూస్తోన్న అధికారులు.
- ఏపీలో మరో రెండు పాజిటీవ్ కేసులు
- విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండు పాజిటీవ్ కేసులు నిర్దారణ
- కరోనా మీద తెలంగాణా సర్కార్ యుద్ధం
- గత ఐదేళ్ళలో రిటైర్ అయిన డాక్టర్ లు, నర్సులకి విధుల్లోకి హాజరు కావాలని పోస్టింగ్
- మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోనున్న సర్కార్
- భారత్ వ్యాప్తంగా 306కు చేరిన కరోనా కౌంట్..మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు
ఆళ్ల నాని, ఏపీ డెప్యూటీ సీఎం.
- ఇవాళ అదనంగా ఏడు శాంపిల్స్ ల్యాబుకు పంపాం.
- మొత్తంగా 142 శాంపిల్స్ పంపితే.. 108 నెగెటీవ్ రిపోర్టులు వచ్చాయి.
- 23 రిపోర్టులు రావాల్సి ఉంది.
- కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.
- ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి.
- ప్రజా సహకారం లేకుంటే వ్యాప్తిని అరికట్టలేం.
- ఏపీలో వ్యాప్తిని చాలా వరకు నిరోధించగలుగుతున్నా.. ప్రజల సహకారం ముఖ్యం.
- ప్రజలు స్వచ్ఛంధంగా జనతా కర్ఫ్యూను సక్సెస్ చేయాలి.
- రేపు ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపేస్తున్నాం.
- ఇంట్లోనే ఉంటే వైరస్ వ్యాప్తి కొంత మేరైనా కంట్రోల్ ఉండే అవకాశం.
- ఏపీలో కరోనా వ్యాప్తి వేగంగా లేకపోవడానికి కారణం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది.
- ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
- వైద్యులకు.. వైద్య సిబ్బందికి థాంక్స్ చెబుతూ సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టాలి.
- కంటి వెలుగు కార్యక్రమాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నాం.
- పెళ్లిళ్లు..ప్రయాణాలు.. ఫంక్షన్లను ప్రజలు వాయిదా వేయాలని కోరుతున్నాం.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ :
- ముందుగానే అప్రమత్తం అయ్యాం
- విదేశాల నుండి వచ్చేవాళ్ళ నుండే సమస్య
- మార్చి ఒకటి నుండి 20 వేల పైగా విదేశాల నుండి వచ్చారు
- నిన్న ఒక రోజే 15 వందల మంది వచ్చారు
- జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేశాము...11 వేల మందిని ట్రేస్ చేశాము...
- 5 వేల 274 నిఘా బృందాలు ఏర్పాటు
- 700 మంది కి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు
- 21 మంది కి పాజిటివ్
- రాష్ట్ర సరిహద్దుల్లో
- 52 చెక్ పోస్ట్ లు
- 78 ఇన్స్పెక్షన్ టీం లు
- హెల్త్ మినిస్టర్ అద్వర్యం లో 5 మంది నిపుణుల తో కమిటీ
- ఇప్పటికి కంట్రోల్ లోనే ఉంది
- విదేశాల నుండి వచ్చిన వారికి చేతులెత్తి దణ్ణం పెట్టి చెపుతున్న సహకరించండి
- ప్రపంచం పరేషాన్ లో ఉన్న టైం లో కొంచెము నియంత్రణ పాటించండి
- స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయండి...
- మానవజాతి క్షేమం ముడి పడి ఉంది..
- మీ కుటుంబ సభ్యులు విదేశాల నుండి వచ్చిన చెప్పండి... ఇది సామాజిక బాధ్యత...
- దగ్గు,జలుబు, జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి
- అన్ని ఖర్చులు ప్రభుత్వమే బరిస్తోంది..
- ఎలాగూ తప్పించుకోలేరు
- జనతా కర్ఫ్యూ లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి
- రేపు ఉదయం నుండి ఎల్లుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ
- ఆర్టీసీ బస్ లు మూసి వేస్తున్నాం
- ప్రతి డిపో లో 5 బస్ లు సిద్ధంగా ఉంచుతున్నాం
- ఇతర రాష్ట్రాల బస్ లను రాష్ట్రం లోకి అనుమతించం
- మెట్రో రైల్ క్లోజ్ చేశాము....5 ట్రైన్స్ సిద్ధంగా ఉంచుతున్నాం
- వర్తక, వాణిజ్య,వ్యాపార సంఘాలు ఎవరికి వారు బంద్ చేసుకోవాలి...
- ఎమెర్జెన్సీ సిబ్బంది తప్ప మిగిలిన అందరూ ఎవరికి వారు క్లోజ్ చేసుకోవాలి
- నియంత్రణ పాటించని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి
- మహారాష్ట్ర సరిహద్దులను మూసి వేసే ఆలోచన తో ఉన్నాం
- మహారాష్ట్ర లో ఇంకా కేసులు పెరిగితే మూసి వేస్తాం
- మీడియా మిత్రులు తిరుగొచ్చు... పెట్రోల్ బంక్ లు, మెడికల్ షాప్స్ ఓపెన్ పెట్టుకోవచ్చు...
- 60 ఏళ్ల వయస్సు దాటినా వాళ్ళు,10 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు 3 వారాల పాటు బయటకు రాకండి
- సీసీఎంబీ ని కూడా వాడుకుంటాం... కేంద్రం పర్మిషన్ ఇచ్చాడు
- ఇప్పుడు ఇలా ఉన్నాం ....రేపు ఎలా ఉంటామో తెలియదు...విజృంభించవచ్చు
- స్వయం నియంత్రణ తప్ప మరో మార్గం లేదు
- కరోన తీసుకొచ్చుకుంటే తప్ప అది మన ఇంటికి రాదు...
- ప్రతి ఇంటికి రేషన్ పంపాల్సి వస్తే ఏమి చేయాలి అని కూడా ఆలోచిస్తున్నాం
- ఎన్ని వేల కోట్లు అయిన ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం
- అన్ని బంద్ చేసి కరోన పై దృష్టి పెడతాం
- వైద్య సిబ్బంది కి ధన్యవాదాలు
- వాళ్లకు అవసరమైన సామగ్రి తెప్పించాం...
- ప్రజల సహకారం కావాలి...
- పని మనుషులకు కూడా సెలవు ఇవ్వండి..
- పీఎం ని అవహేళన చేసే విదంగా మాట్లాడుతున్నారు... సోషల్ మీడియా లో హేళన చేస్తున్నారు
- అలాంటి వేదవలను అరెస్ట్ చేయాలని డీజీపీ ని కోరుతున్నాను...
- చప్పట్లు కొట్టడం ద్వారా వైద్య సిబ్బందికి కి సంఘీభావం తెలిపేందుకు పీఎం పిలుపునిచ్చారు
- జాతి ఐక్యతను కాపాడే ప్రక్రియ.
- తెలంగాణ ఉద్యమం లో అలాటి పిలుపు చాలా ఇచ్చాం
- రేపు సాయంత్రం 5 గంటలకు నేను నా కుటుంబ సభ్యులతో కలిపి చప్పట్లు కొడతాం
- రాష్ట్రము అంతటా చప్పట్లు కొట్టండి
- రాష్ట్రం అంత సైరన్ మోగించే ఏర్పాటు...
- మతప్రచారకులు ట్రెస్ అయ్యారు...
- వాళ్లే వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు
- అవసరం వస్తే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తాం
- అలాంటి పరిస్థితి వస్తే ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపించే ఏర్పాట్లు
- ప్రభుత్వ పరంగా హోమాలు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నాం
- ఏ దేవాలయం లోను నిత్య పూజలు ఆగలేదు...
- 24 గంటలు బంద్ చేస్తే భూకంపం ఏమి రాదు కదా...
- కొనప్ప ను కూడా లోపల వేశాం...
- ఈ పరిస్థితి లు వాడుకునే దుర్మార్గులు ఉన్నారు... బ్లాక్ మార్కెట్ చేస్తారు... కృత్రిమ కొరత సృష్టిస్తారు
- ప్రభుత్వం అన్ని ఆలోచిస్తోంది...
రైళ్లు రద్దు
- జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరిగే 250 రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రద్దు
- ఈ రోజు అర్థ రాత్రి నుంచి రేపు 10 గంటల వరకూ పూర్తిగా రద్దు
- జంట నగరాల్లో తిరిగే సబర్మన్ రైళ్లను కూడా రద్దు చేసిన అధికారులు
- 121 ఎంఎంటీసీ సర్వీసుల్లో 109 రద్దు
- రేపు అందుబాటులో ఉండనున్న 12 ఎంఎంటీఎస్ సర్వీసులు
ఉచితంగా శ్రీవారి లడ్డూలు
- శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో 2 లక్షలకు పైగా లడ్డూల నిల్వ
- 10 లడ్డూల చొప్పున టీటీడీ ఉద్యోగులకు పంపిణీ
- ఉగాది కానుకగా ఉద్యోగులకు లడ్డూలు పంపిణీ చేయనున్న టీటీడీ
- జనతా కర్ఫ్యూకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు
- ఏపీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
- 35 మందికి పరీక్షలు, 108 మందికి నెగిటివ్
- 24 మంది రిపోర్టుల కోసం అధికారుల ఎదురుచూపు
- తెలంగాణలో 19 కరోనా పాజిటివ్ కేసులు..
- ఇతర దేశాల నుంచి వచ్చినవారిపై తెలంగాణ సర్కార్ నిఘా
- ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించిన అధికారులు
అది చైనాలో పుట్టింది.. చైనీస్ వైరసే..
https://www.ntvtelugu.com/post/donald-trump-is-calling-coronavirus-the-china-virus
కరోనా ఆపింది... ఆన్లైన్ కలిపింది...!
https://www.ntvtelugu.com/post/online-wedding-ceremony-in-uttar-pradesh-up-coronavirus-cases-rise
కరీంనగర్లో ఇంటికి కొనసాగుతున్న స్క్రీనింగ్ పరీక్షలు..
- జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు..
- ఇప్పటి వరకు 60 వేల మందికి పైగా పరీక్షలు చేసిన మెడికల్ సిబ్బంది
- ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ గాంధీకి తరలింపు
అరసవల్లి ఆలయంపై కరోనా ఎఫెక్ట్
- నేటి నుంచి 10 రోజుల పాటు భక్తులకు నో ఎంట్రీ
- మార్చి 31 వరకూ అరసవల్లిలో భక్తులకు దర్శనాలను నిలిపివేసిన అధికారులు
- నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించనున్న ఆలయ అర్చకులు
- ఆలయ చరిత్రలో తొలిసారి 10 రోజుల పాటు భక్తులకు దూరంకానున్న సూర్యదర్శనం
కనికా వ్యవహారంపై యూపీ సర్కార్ సీరియస్
https://www.ntvtelugu.com/post/uttar-pradesh-govt-serious-on-kanika-issue
కరోనా కట్టడికి తెలంగాణా కొత్త మార్గదర్శకాలు
https://www.ntvtelugu.com/post/telangana-government-new-regulations-for-corona
ఏపీ నినాదం : నో టు పానిక్.. ఎస్ టు ప్రికాషన్స్ !
https://www.ntvtelugu.com/post/say-no-to-panic-yes-to-precautions-says-jagan
మోడీ చెప్పినట్టు చేయండి : పవన్ కళ్యాణ్
https://www.ntvtelugu.com/post/pawan-kalyan-urges-people-to-observe-janata-curfew
పార్లమెంట్ కి చేరిన కరోనా ?
https://www.ntvtelugu.com/post/corona-enters-indian-parliament-60303
కరోనాకి భయపడకుండా ఈ పని చేయండి : రానా
https://www.ntvtelugu.com/post/rana-daggubati-tweet-about-corona
క్వారంటైన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే
https://www.ntvtelugu.com/post/mla-koneru-konappa-corona-issue
249కి చేరిన కరోనా కౌంట్...తెలుగు రాష్ట్రాల్లో 22 !
https://www.ntvtelugu.com/post/corona-count-reaches-249
ఎల్బీనగర్ చింతల్‌కుంట వద్ద ఆర్టీసీ బస్సులో కరోనా అనుమానితుడు..భీమవరం వెళ్లేందుకు బస్ ఎక్కిన కరోనా అనుమానితుడు నాని..అతని చేతికి స్టాంప్ వేసి ఉండటంతో అతడ్ని నిలదీసిన ఆర్టీసీ అధికారులు#CoronavirusOutbreakindia #CoronaVirusUpdate #coronavirusindia
— NTV Breaking News (@NTVJustIn) March 20, 2020
కరోనా కట్టడికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే
https://www.ntvtelugu.com/post/india-issues-new-coronavirus-advisory
క్వారంటైన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే
https://www.ntvtelugu.com/post/mla-koneru-konappa-corona-issue
కరోనాపై జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై .. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు రెగ్యులేట్ చేయాలని లేఖలో ప్రస్తావించింది. ప్రభుత్వ ఆఫీసులు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రైవేటు సంస్థలు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కరోనాపై ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని లేఖలో కోరారు.
మహారాష్ట్రలో హై అలెర్ట్
కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో... ఉద్ధవ్ థాక్రే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మెట్రోపాటన్ రీజియన్‌ను పూర్తిగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, పుణే, పింప్రీ-చించ్వాడ్, నాగ్‌పూర్ నగరాల్లో అన్ని షాపులు, వ్యాపార సంస్థలను మూసి వేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
- కరోనా దృష్యా తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం
- రేపు శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథం
- సోమవారం నుంచి ఈనెల 30 వరకు జరగాల్సిన టెన్త్ పరీక్షలు వాయిదా
- ఈనెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం
- ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు రీ షెడ్యూలు చేయాలి
- మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన పరీక్షలపై.. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకావాలి-హైకోర్టు
యాదాద్రిలో స్వామివారి దర్శనాలు నిలిపివేత
- కొండ కింద స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్న భక్తులు
- కొండపైకి వెళ్లే దారులన్నీ మూసివేసి పోలీసుల పహారా
- కొండపైకి ఎవరినీ అనుమతించని పోలీసులు
- ఏకాంత సేవలో స్వామివారికి నిత్య కైంకర్యాలు
- కరోనా లక్షణాలతో వరంగల్ ఎంజీఎం లో చేరిన వ్యక్తి. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన వ్యక్తికీ కరోనా లక్షణాలు.
- అయోధ్యలో శ్రీరామనవమి పై కరోనా ఎఫెక్ట్. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను రద్దు చేసిన యూపీ సర్కార్. ప్రజలు ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలన్న యూపీ సీఎం యోగి.
మరొకరు మృతి
- భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
- జైపూర్‌లో కరోనాతో ఇటలీకి చెందిన టూరిస్టు మృతి
- కొద్ది రోజుల క్రితం కరోనాతో కోలుకున్న టూరిస్టు భార్య
- కరోనాతో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు, ఓ విదేశీయుడు మృతి
- అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10వేలకు చేరింది. కరోనా వలన అమెరికాలో ఇప్పటికి 160మంది చనిపోయారు. ఒక్క రోజులోనే 1500 కొత్త కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షలు చేసేందుకు 50 రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశాం. కరోనాను ఎదుర్కొనేందుకు వైట్ హౌస్ లో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం- అమెరికా ప్రభుత్వం
- కరోనాకు చికిత్స లేదు... వ్యాక్సిన్ లేదు. మీ జీవితంలో ఇంకొన్ని వారాలు నాకివ్వండి. మానవ జాతిని కరోనా సంక్షోభంలోకి నెట్టింది. కరోనాపై యుద్ధం చేయడానికి ప్రజల సహకారం కావాలి. కరోనా బాదితులందర్నీ ఐసోలేషన్ కు తరలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సూచలను తప్పకుండా పాటించాలి.
- దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్ తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ప్రజలు చాలా అప్రమతంగా ఉండాలి. కరోనా కన్నా ఇప్పుడు సీరియస్ అంశం ఏది లేదు - పీఎం మోడీ.
- ప్రగతి భవన్ ముగిసిన సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం. కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్న సీఎం కేసీఆర్.
- తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదు. భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలి. రేపటి నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తాం - ఈవో సింఘాల్
- కరోనాపై కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. 65 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని సూచన. పదేళ్ల లోపున్న చిన్నారులను బయటకు పంపొద్దన్న కేంద్రం. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లు రద్దు. ఈనెల 22 నుంచి 29 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేత. వారంపాటు అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత.
- ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది. థియేటర్లు, దేవాలయాలు, మసీదులు 31 వరకు మూసేస్తున్నాం. బార్లు, రెస్టారెంట్ లలో కనీసం మీటర్ దూరం ఉండేలా చర్యలు. ఐటి ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసుకోవాలని సూచన - ఆళ్ళ నాని
- ఒంగోలులో తప్పించుకునేందుకు యత్నించిన కరోనా బాధితుడు. ఐసోలేషన్ వార్డ్ నుంచి తప్పించుకునేందుకు యువకుడి యత్నం. రిమ్స్ రెండో అంతస్తు నుంచి పారిపోతుండగా పట్టుకున్న సిబ్బంది. ఈనెల 15న లండన్ నుంచి వచ్చిన యువకుడు.
- అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన భారత్. ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు నిర్ణయం. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు.
- రేపటి నుంచి పూరి జగన్నాథుడి ఆలయం మూసివేత.
- టిటిడి అధికారుల అత్యవరస సమావేశం. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం మూసివేసే ఛాన్స్. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏకాంతంగానే శ్రీవారి సేవలు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్.
- కాసేపట్లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలతో చర్చించనున్న కేసీఆర్. ఇప్పటికే సీఎస్, వైద్య అధికారులతో తాజా పరిస్థితిపై చర్చించిన వైద్య ఆరోగ్యశాఖ.
- ఏపీలో మరో కరోనా కేసు
- ఏపీలో రెండో కరోనా కేసు నమోదు
- లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్
- ప్రకాశం జిల్లాలో నమోదైన రెండో కరోనా కేసు
- యువకుడికి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స
- కరోనా ఎఫెక్ట్‌తో చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత
- నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేత
- రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం...
- కరోనాను ఎదుర్కొనే అంశంపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ
-
కరోనా ఎఫెక్ట్: పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వ ఉద్యోగులకు గంట ముందే రిలీవ్.
-
విదేశాల నుంచి వచ్చిన వాళ్లు అన్నిపరీక్షలు చేయించుకోవాలి.. పరీక్షల తర్వాతే విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఇళ్లకు వెళ్లాలి.. సామూహిక పండగలకు దూరంగా ఉండాలి-సీఎం కేసీఆర్
-
హైదరాబాద్: కరోనాపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ల వల్లే కరోనా వ్యాప్తి-కేసీఆర్
-
అమరావతి: కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు.. షెడ్యూల్లో ప్రకటించిన అన్ని బోర్డ్ పరీక్షలు యథావిథిగా కొనసాగుతాయి
కరోనా వైరస్... వీఐపీలపై మమతా ఫైర్..!
https://www.ntvtelugu.com/post/cant-claim-vip-status-avoid-covid-19-test-says-mamata-banerjee
కరోనాపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు ఆహ్వానం
https://www.ntvtelugu.com/post/cm-kcr-to-hold-high-level-meeting-on-coronavirus-on-march-19
కరోనా ఎఫెక్ట్... ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం...
- కోవిడ్19 వైరస్ కారణంగా రేపటి నుంచి మర్చి 25వ తేదీ వరకు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత
మున్సిపల్ కమిషనర్‌పై వేటు... కరోనా కారణమా? లేక వైన్ షాపేనా..?
https://www.ntvtelugu.com/post/manthani-municipal-commissioner-mallikarjuna-swamy-suspension
కరోనా ఎఫెక్ట్: చిలుకూరు బాలాజీ టెంపుల్ మూత.. ఎప్పటి నుంచి అంటే...?
https://www.ntvtelugu.com/post/chilkur-balaji-temple-closed-from-march-19th-to-25th-due-to-covid-19
ఇప్పుడెలా..? హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టళ్లు కూడా మూత...!
https://www.ntvtelugu.com/post/private-hostels-also-closed-in-hyderabad-with-coronavirus-effect
ప్రజలకు దణ్ణంపెట్టి మరీ వేడుకుంటున్నారు... బయటకు రావొద్దు ప్లీజ్.... !!
చికెన్ పని చేశారు.. ఇప్పుడు మటన్‌పై మొదలెట్టారు..!
https://www.ntvtelugu.com/post/fake-news-on-social-media-about-coronavirus
- భారత్‌లో 142కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- పశ్చిమబెంగాల్లో మొదటి కేసు నమోదు
- మహారాష్ట్రలో అత్యధికంగా 39 కరోనా కేసులు
- కర్ణాటకలో మొత్తం 11 పాజిటివ్ కేసులు
- ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు : 1,97,177
- ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు : 7938
- కరోనా నుంచి కోలుకున్న బాధితులు : 67,003
దేశాలు కేసులు మరణాలు
చైనా 80,881 3,226
ఇటలీ 31, 506 2,503
ఇరాన్ 16, 169 988
స్పెయిన్ 11, 826 533
ఫ్రాన్స్ 7,730 175
అమెరికా 6,456 109
- తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు.
- యూకే నుండి వచ్చిన వ్యక్తి కి వైరస్ సోకినట్లు గుర్తింపు.