వ‌చ్చేవారం నుంచి కోవాగ్జిన్ సెకండ్ డోస్ ట్ర‌య‌ల్స్‌…

దేశంలో ఇప్ప‌టికే మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాట‌లో ఉన్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబ‌డిన వారికి అందించేవే.  మూడో వేవ్ ప్ర‌మాదం ముంచి ఉంద‌ని, చిన్న‌పిల్ల‌ల‌కు సోకే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌టంతో చిన్నారుల‌కు అందించే వ్యాక్సిన్‌పై దృష్టిపెట్టారు.  భార‌త్ బ‌యోటెక్ సంస్థ చిన్నారుల కోసం కోవాగ్జిన్ ను త‌యారు చేస్తున్న‌ది.  2 నుంచి 18 ఏళ్ల వారిపై వ్యాక్సిన్‌ను ప్ర‌యోగాలు చేస్తున్నారు.  ఇప్ప‌టికే 6-12 ఏళ్ల వ‌య‌సువారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు.  కాగా వ‌చ్చే వారంలో 2-6 ఏళ్ల వ‌య‌సు వారికి కోవాగ్జిన్ సెకండ్ డోస్ ఇవ్వ‌బోతున్నారు.  ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చిన్నారుల‌పై ఈ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఆగ‌స్టు చివ‌రి నాటికి చిన్నారుల వ్యాక్సిన్ కు సంబందించి నివేదిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.  సెప్టెంబ‌ర్ లో చిన్నారుల‌కు సంబందించిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: ఫోన్ హ్యాకంగ్‌పై ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క వ్యాఖ్య‌లు

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-