సమంత పరువునష్టం కేసు తీర్పు వాయిదా

గత నెలలో అక్కినేని నాగ చైతన్య, సమంతలు వైవాహిక జీవితం నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సమంత క్యారక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. సినీనటి సమంత కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ళు తన పరువుకు భంగం కలిగించాయని పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read Also:స‌మంత కేసులో ముగిసిన వాద‌న‌లు… తీర్పు…

ఈ కేసులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పుని కోర్టు వాయిదా వేసింది. కేసు వాదనల సందర్భంగా యూట్యూబ్ ఛానెళ్ళపై పరువు నష్టం కేసుకి బదులుగా వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు భవిష్యత్తులో తనకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక వార్తలు రాయకుండా ఇంజెంక్షన్ ఆర్డర్ జారీచేయాలని సమంత తరఫు న్యాయవాది కూకట్ పల్లి కోర్టుని కోరారు. వాదనలు విన్న కోర్టు తుది తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని మీడియా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. యూట్యూబ్ ఛానెళ్ళ నుంచి క్షమాపణ కోరతారా ఏం జరగనుంది?

Read Also:అది మా ఉద్దేశం కాదు.. ఎన్టీవీతో యూట్యూబ్ ఛానెల్

Related Articles

Latest Articles